Pages

15 March 2014

a టెస్ట్



నా ముఖంలోకి చూస్తూ,
నువ్వు బానిసవి కదూ అన్నాడు.

నేను నవ్వి ఊరుకున్నాను.

మళ్లీ అన్నాడు కాస్తంత కోపంగా,.
 నువ్వు బానిసవే కదూ అని

కాస్త జేవురించిన ముఖంతో,
తల పక్కకు తిప్పుకున్నాను.

అతను మరింత గట్టిగా కేకలేసాడు,.
నువ్వు బానిసవే, బానిసవేనని.

ఆగ్రహంతో అతన్ని,.కొట్టి నెట్టేసాక,
ఆ పిచ్చివాడు నవ్వుతున్నాడు.
అతని మాటను స్థిరపరుచుకొని.
https://www.facebook.com/groups/kavisangamam/permalink/719893584730063/?stream_ref=21

6 March 2014

ఆఫ్స్కారింగ్స్



రాజుల చెరను దాటిన దాన్ని, పత్రికా పొరల్లో ఇరకపెట్టి
పాత్రికేయుల పాదాల క్రింద బలిపెడుతూ కవిత్వాన్ని
క్రియాశీలవాదుల కరస్వేదాన్నే కవిత్వం చేస్తూ
పత్రికా అచ్చులనే మెయినస్ట్రీమ్ గా పూజిస్తూ

సోకాల్డ్ కవుల సమూహాల మధ్య విర్రవీకుంటూ
చిందులేస్తూ చుప్పనాతి వాక్యాలతో,
మరింత వీకు కవిత్వాలకు దారులేసుకుంటూ,
ఏ పరీక్షకు నిలువక, దేనికీ వెరవక
పేర్ల పైన పేర్చుకుంటూ పిచ్చి పదాలను,

కలుపుకుంటూ చేతులను,
కౌగిలింతలతోనే, కరచాలన ధ్యనులతోనే,
 కార్చుకుంటూ జ్ఞానపు చొంగను,
కవులుగా చెలామణయ్యే చెల్లని కాసులు
కనెక్టివిటి పాపులారిటీ నెత్తికెక్కిన పోతులు,
భయంకర భజనవాద కవితత్వాల ఉద్యమకారులు,
కాకా కొట్టుల్ల మీద కవులైన కాకులు,
పనికి రాని పాత కాపులు పాడే కొత్త పాట,

 అంతర్జాల కవిత్వం పసలేనిదని, ద్వితీయ శ్రేణిదని.
ఇక్కడ నిలబడలేక, కాస్తంత కూడా వెలగలేక.

4/3/2014