నా మానాన నేను మా ఆవిడ వేసిన మాడిపోయిన మసాలా దోసె తిట్టుకుంటూ తింటూ ఎప్పుడు ఎలా చూసానో తెలియదు కానీ సరిగ్గా అదే సమయానికి (బహుశా ఎవరైనా కామన్ ప్రెండ్ కామెంట్ లేదా ట్యాగ్ ద్వారా అయ్యిండొచ్చు)
భాస్కర్ కె
గారు రాసిన 'బేకారీలు' అనే హెడ్డింగ్ తో కూడిన పట్టుమని ఎనిమిది నుంచి పది లైన్లు ఉన్న పోస్ట్ కనపడింది బహుశా ఓ సంవత్సరం లేదంటే అంతకన్నా ముందేనో కరెక్ట్ గా గుర్తుకు లేదు.అయితే ఇక్కడ నాకు మొదటి ఆసక్తి ఎక్కడ కలిగింది అంటే 'బేకారీలు' అనే పదం దగ్గర. వాస్తవానికి ఈ పదాన్ని ఎక్కువగా నేను సాటి మనుషులను తిట్టే పదాలలో ఒకటిగా మాత్రమే విన్నా. సరే చూద్దాం అని పోస్ట్ చదవడం మొదలు పెట్టాక బలే అనిపించింది. పెద్దగా సుత్తి లేకుండా , చదివే వారికి ఇట్టే అర్థం అయ్యేలా ఉండడం నిజంగా గ్రేట్. ఇక 'ఆమె' దెప్పిపొడుపులు చూస్తుంటే నన్ను ప్రతి విషయంలో, ప్రతి సంధర్భంలో , ప్రతి రోజు నన్ను మా ఆవిడ తలంటినట్లే అనిపిస్తుంది చదివిన ప్రతి 'బేకారీలో'. బహుశా ఈ భావన నాకే కాదు ఈ 'బేకారీలు' చదివే ప్రతి ఒక్కరికీ అలాగే అనిపిస్తుంది అని నేను అనుకుంటున్నాను.
అసలు మామూలుగా నేను కధలు, నవలలు ఎక్కువగా ఇష్టపడతా నా చిన్న వయస్సు నుండి కూడా. కవిత్వం అన్నా లైన్ లైన్ విడివిడిగా చదవడం అన్నా అసలు పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. కానీ ఫేస్బుక్ లో ఓ ఐదు ఆరుగురివి మాత్రం ఆసక్తిగా చదువుతా. అలా వారిలో భాస్కర్ సర్ ఒకరు.
వాస్తవ జీవితానికి ఎంతో ఎంతో దగ్గరగా ఉండే మరియు రోజు వారి ప్రాపంచిక పరిస్థితులకు అనుగుణంగా రాయడం ఇందులో ప్రత్యేకత.
అతను ఏదో చేద్దాం అనుకోవడం , ఏదో ఆలోచించడం , ఎక్కడో బ్రమలలో తేలియాడడం, ఆ వెంటనే ఆమె అతనిని వాస్తవిక ప్రపంచం గురించి ఒకే మాటతో తుస్సుమనిపిస్తూ అతనిని తలంటడం బలే అనిపిస్తుంది.
*******
ఈ పరిచయ భాగ్యంలో భాగంగా ఈ పుస్తకంతో పాటు మరో మూడు పుస్తకాలను పంపించారు భాస్కర్ సర్ ముందు చెప్పకుండా సర్ప్రైజ్ చేస్తూ.
అలా 'బేకారీలు' పుస్తకం వచ్చింది నాకు. నిజంగా గ్రేట్ సర్ మీరు. ఎంతో బాగా రాసారు. పుస్తకం నాచేతికి వచ్చాక మీతో మాట్లాడడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. కృతజ్ఞతలు సర్.
*****
ఒక్కోదాన్ని అతికించుకుంటూ
నిర్మించేది కాదు జీవితమంటే
ఉన్నవాటిని బద్దలు కొట్టుకుంటూ
పగిలిన శకలాల మధ్య నిరంతర వెతుకులాటే
అసలైన జీవితమని వ్యాఖ్యానించినప్పుడు
అపనమ్మకంగా అడుగుతాడు, అతను
నిజం చెబుతున్నావా నువ్వు, నిజంగా అని.
*****
అతను గొప్పవాడు తెలుసా అన్నాడతను
అవును, నిజమే
గుండెల్లో మాట పెదాలదాకా రాదు
పెదాలపై మాట గుండెలదాకా పోదు
మామూలు విషయమా అది
అంటుందామే, క్యాలీఫ్లవర్లో పురుగులను ఏరుతూ.
*****
ఇలా వేటికవే ఏంతో ఆసక్తి రేకెత్తించే 'బేకారీలు'.
బహుశా చిన్న నాటి నుండి పుస్తకాలు చదవడమే కానీ మొదటి సారి సమీక్ష రాస్తున్న.
****
శ్రీను బొద్దని.
No comments:
Post a Comment