Pages

Showing posts with label బేకారీలు. Show all posts
Showing posts with label బేకారీలు. Show all posts

30 March 2016

బేకారీులు 101-125

101
తిండితో పాటు,
నంజుడికి ఓ బుర్ర దొరికింది,.
ఇంకేం కావాలి,.

 జీవితానికి,...
102
మోయాలి,.
మోయించుకోవాలి.,.
మోత మహోన్నతం,

తెలుసుకోవాలి,..
103
ఒక రోదనతో మొదలై
కొన్ని ఏడుపులతో

ముగిసిపోతుంది
జీవితం.
104
ఎంత కప్పినా తప్పును
గిల్టి కాన్షస్

గిల్లుతూనే వుంది.
105
వ్యాకరణాన్ని వెతికి
వాక్యానికి విలువకట్టే వాడు
పండితుడనుకోకు

106
జీవితాన్ని
నువ్వంగీకరించలేవు.
జీవితం
నిన్ను ప్రతిఫలించలేదు.

ఓహ్, ఎంత దురదృష్టం.
261015

107
నువ్వు
మనుషుల గురించి మాట్లడతావ్
నాకు

జంతువులే గుర్తొస్తుంటాయ్
క్షమించు,..
108
మనసులోపల నీకు విషమెంత వున్నా,..
మాటలలో మర్యాద,

మన్ననలనిచ్చు
వినుకోరా చిన్నా,..లోకం తీరు కనరా కన్నా,..
109
కాలమెన్నడు నీకు కలసి రానే రాదు,.
తెగువ లేక నువ్వు బతికినప్పుడు,...
వినుకోరా చిన్నా,..లోకం తీరు కనరా కన్నా,..


110
ఘర్షణలేకుండా చలనాలు
సంఘర్షణ లేకుండా మార్పులు

సులభమని ఊహించుకోకు.
అందులోను
ఇట్లాంటి చోట్ల.

111
బడికి పొమ్మంటే
ఏడుస్తుంది అజ్ఞానం.
ఎంత పసి హృదయం!
112
అమ్మఒడి,
కమ్మనిబడి
రెండు స్వర్గాలు భూమి మీద.
113
ఆలోచనలు పసిపిల్లలు
ఎటుపోతాయో
వాటికే తెలియదు.
114
స్వార్ధం చెప్పే సుద్దులు
స్థిర పడుతున్నాయ్.
సర్దుబాటు సాధ్యమేనా!
115
గమ్యమెప్పుడో
నిర్ణయించబడే వుంది.
దిగులంతా
దారి గురించే.
251015
116
ప్రశ్నించడం గొప్ప మలుపన్నా !
బలుపు కాదా?
అన్నాడు,  ఇంకొకడు.
117

భుజం పై బరువు మోయలేకేమో
స్పందనలనిప్పుడు

బాల్యం వదుల్తుంది.

118
ఎక్కడోడో అయితే
పొగిడి పైకెక్కిస్తాం,.
పక్కనోడైతే ఏకిపారేస్తాం,..

119
నువ్వెవ్వడివనేది
నిర్ణయించుకొనే కొద్దీ
లేదా నిర్ణయించబడే కొద్దీ

నువ్వు జీవించే చోటు
కుంచిచుకుపోతుంటుంటుంది.
281015
120

ఆరామ్గా కూర్చొని
ఖుషిచేద్దామనుకున్నప్పుడు
దునియా మొత్తం తిప్పేస్తాది.

ఉత్సుకతతో శక్తినంతా కూడదీసుకొని
లోకాన్ని తిరిగేద్దామంటే
కట్టడి చేసి, ఓ  మూల బంధీని చేసేస్తుంది

జిత్తులమారి కదా,. ఈ జీవితం.
121

స్థిరత్వం
సహజమా, అసహజమా
విడమర్చుకొని చెప్పుకుంటున్నా అర్థంకాలా.

విఫల తాత్వికతల
సఫల ప్రయాణమా ?
 లేక
సఫల తాత్వికతా విఫల ప్రయాణమా? 
ఏమో!
అంతా ఉత్త ఆలోచనలే,

 కేవలం నిమిత్తమాత్రుత
అంతకంటే ఏం లేదు
జీవితం
311015
122 
మోసం చేయాలనుకున్నప్పుడు.
ముందు,
నమ్మకంగా కొన్ని మాటలు చెప్పాలి.

మొత్తంగా దోచుకోవాలనే
దూరదృష్టున్నప్పుడు
భ్రమల మానియాల్లో
మెదడుని ముంచేయ్యాలి.

టార్గట్కి అర్థమవ్వనంత వరకు ఓ.కే.
ఖర్మకాల్తే, ఆ తరువాత కథ మారిపోద్ది.
123 
నేను నమ్మే
అబద్దం పట్ల
నాకు విశ్వాసం వుంది.

నిజం పట్ల నీకున్న
గౌరవంకంటే ఎక్కువగా.
124
భావం స్థిరపడటం
 బలం అనుకోకు.

గుంజకు కట్టబడ్డ
గానుగెద్దే ఇక,  ఆ తరువాత

041115
125
మాటల్లో సుమూర్ఖత్వమో
వాక్యాల్లో సుమేధావీతనమో
సమజ్ కాకపోతే సమస్యేం లేదు.

అవకాశవాదం
అర్థం చేసుకోచాలు,
లక్షణంగా బతికిపోతావ్.

031115

29 March 2016

బేకారీలు 76-100

76
కాలం గడిచిపోయింది,
జీవితం కేవలం జ్ఞాపకమైంది.
77

కవిత్వం ప్రవాహమైంది.
నేనేమో అనుకున్నాను కాని,
జీవితాన్నే లాక్కేల్లేంత, 
ఉదృతమైన వరవడైంది.
జీవితమే లేకుండా చేసే రేవుకెరటమైంది.


78
అద్భుతాలకు మాత్రమే
ఆకర్షింపబడేవాడు
 అపరమూర్ఖుడు.
ప్రతిది అద్భుతమని మురిసేవాడు,

అకాల జ్ఞాని

79
 తప్పులు చేసి కూడా, 
మెప్పులు పొందాలనుకోవాలనుకుంటే,.
పెద్దగా మార్గాలు వెతుక్కోనక్కర లేదు.
బహిరంగ పశ్చాత్తాప ప్రకటన చాలు,

కాస్తంత ఏడుపుతో


80
నాకెవడు వద్దనుకోవడం
ఒక తింగరితనం.

అందరూ నావాల్లనుకోవడం,
లోకం తెలియనితనం.



81
వదలివేయబడటంలో వుండే ఓ బాధ
వదలేవాడికి ఎలా తెలుస్తుంది.
నీకు నువ్వుగా చెప్పుకోలేకుంటే.

చేతకానప్పుడు కూడా

 చెప్పుకోవాలని
వుండుండొచ్చు, మనసులో.
నాకు రాయడం రాదనో,
ప్రేమించడం రాదనో,
చూపించే కనీస ఆదరణనైనా,
నిలుపుకోవడం చేతకాదనో,
అర్థమవుతూనే వున్నా,.
అది కూడ చెప్పుకోలేక
ఇంకా దూరమై పోతున్నట్లున్నాను,.
నీకు నేను


82

పొయిట్రి ఫర్ ద పొయిట్స్

 టు ది పొయట్స్
 బై ది పొయట్స్

ఇట్ ఈజ్ కాల్డ్
పోయిటో పిటి
అందామె కాస్తంత పిటీగా

83
నేనేమీ కానప్పుడు నీకు,
మరింత స్తబ్ధంగా కనిపిస్తాను.

నువ్వు అంగీకరించలేనన్ని
అప్రధాన భావాలను మోసుకుంటూ.

84
పిచ్చితననాకి పరాకాష్టనే
నీ గుప్పిట్లో గింజకాకపోతే అదిక తాలుదే.

తూకం తూచడం తెలిసుండాలి, బరువులతో.
అది కవిత్వమైన, మానవ సంబంధమైన.

85 
ఒక్కోదాన్ని అతికించుకుంటూ,..
నిర్మించేది కాదు జీవితమంటే,.

వున్నవాటిని బద్దలు కొట్టుకుంటూ,.
పగిలిన శకలాల మధ్య,
నిరంతర వెతుకులాటే,
అసలైన జీవితమని, వ్యాఖ్యానించినప్పుడు,.

అపనమ్మకంగా అడిగింది,.తను,..
నిజం చెబుతున్నావా,.నువ్వు ,..నిజంగా అని,..
అమాయకపు కళ్లను మరింత విప్పార్చుతూ,...

86
నువ్వప్పుడు నడక నేర్చుకుంటున్నావనుకుంటా,..
ఒక్కోదాన్ని ధ్వసం చేస్తూ,..విజయహాసంతో,.

కొన్ని లోకాలు నేలమట్టమయినాక,..
నీకంటూ నువ్వు 
కొత్త ప్రపంచాలను సృష్టించుకొన్నాక,..

విధ్వంసం కాదు కదా,.
చిన్న చిన్న మార్పులనే 
సహించలేనంతగా మారిపోయాక నువ్వు,.
నాకర్ధమౌతుంది సుమా,
జీవితంలోని సహజత్వం.


87
నీకో లక్ష్యం వున్నప్పుడు,
నిన్ను నువ్వు కోల్పోయినా,.ఫరవాలేదు,.
ఎలాగోలా సమర్ధిస్తాను నేను,...

మరొకడి స్వార్ధ స్వప్నంలో
దృశ్యంగా మారడం,.
ఎంత ఊరడించుకున్నా సరే,..
కాస్తాంత దుఃఖాన్నే మిగులుస్తుంది.

88
అమాయకుడు ప్రేమిస్తాడు,.
తెలివైన వాడు వాడుకుంటాడు,,
వ్యాపారి అమ్ముకుంటాడు,..
దేన్ని అని అడక్కు,.
పిచ్చోడా,.చెప్పింది విను,..
కన్ఫ్యూసన్ లో కూడా క్లారిటి వుంటుంది,.
నీకర్థం చేసుకునే మనసుంటే,.

89
అతన్ని గురించి
నువ్వేమనుకుంటుంటావో
అదెప్పటికి
ఒక చెప్పుకోలేని
ఆరని మథన.

అయిష్టతతో కూడిన
ఓ గరుకు చలిలాంటి
సరీసృపస్పర్శ.
241015
90
1
అడుక్కొనువారు ధన్యులు.
వారికి తెలుసు,. వారికేం కావాలో.
2
ఏం కావాలో తెలియని వారు,
తెలిసిన నోరు పెగలని వారు,
దేన్ని అడగలేడు.
బిగసుకుపోయి, నీలగడం తప్ప.

91
వ్యక్తిత్వాన్ని గొరుక్కొని ప్రతిరోజు
అలా నీ ముందు నిలబడతానిక,
పొగడ్తల పాట పట్టుకుని,
ఏమొస్తుందంటావా , అదోతుత్తి.
లోమాట, కనిపించే నీ శక్తి.

అవసరపుతీపు గుండె గతుకుతున్నప్పుడు,
తీర్చేవాడి అపానవాయువైన
సుగంధ పరిమళభరితమై
 సోకేయదూ, నాసికకు.
దీనయ్య జీవితం. దణ్డంరా, సామి.

92
నేను తనవంక చూస్తూ,.
అదేపనిగా మాట్లాడుతున్నప్పుడు,.
అప్పుడు తనడుగుతుంది,.
ఎందుకంతా నిశ్శబ్థంగా వున్నావని.

93
తొక్కబడిందే
పక్కనోడికి తోవవుతుంది
 ఎక్కువ మందికి తోడవుతుంది
సృజనకు మాత్రం ఎంగిలవుతుంది.

231014

94
మాటలతో మోసేయ్యడం,.
ముద్రలు గుద్దేయడం,..
మహామహుల మతలబులేంటో
మామూలోడికి మింగుడుపడవు,.
మహనీయత్వం అర్థం కాదు.


95
కుంభవృష్టి
చిత్తడిచిత్తడై

చెదిరిపోయింది
బతుకుచిత్రం


97
అవకాశానికి
అనుభవానికి మధ్య అంతరం
కొన్ని సార్లు జీవితమంత.

జారిపోతే కాని తెలసుకోలేం, చాలా సార్లు.


98
గుర్తింపు గొడవ
ప్రతిభది కాదు,.
ఎప్పుడూ, మామూలు మనిషిదే,.

99
నిజంగా నిజం
నిన్ను నువ్వు నిర్ణయించుకోనేలోపే
నిర్దారిస్తాడు నిన్ను

ఎదుటివాడు.
100
ఖర్చు చేసైనా సరే
కాస్త కాలం
మిగుల్చుకోవాలి కదా
మంచి మిత్రుల్ని.