గడ్డలు కట్టిన అసంతృప్తి,
కరిగి ప్రవహించిన రోజు,
అది కవిత్వమై పొర్లుతుంది.
గూడు కట్టుకుపోయిన వేదన,
చెదిరిపోయేటప్పుడు,
కవిత్వమై కురుస్తుంది,.
నిస్సహాయత నిప్పులా కాలుస్తున్నప్పుడు,
అంతకంటే,ఇంకేం చేయలేనప్పుడు,.
అదీ కవిత్వమై దహిస్తుంది,.
పెల్లుబుకుతున్న ఆనందం,.
పట్టరానంత ఆవేశం,.
గుండెల్లో కట్టలు తెంచుకున్నప్పుడూ,.
అదీ కవిత్వమై దూకుతుంది,.
ఏదైతేనేం కాని,.
అప్పుడప్పుడన్నా,.
జీవితం కవిత్వంలో ప్రతిఫలిస్తుంది,.
మీ బ్లాగుని "పూదండ" తో అనుసంధానించండి.
ReplyDeletewww.poodanda.blogspot.com
ప్రయత్నస్తానండి,.ధన్యవాదాలు,..పూదండ గారు,..
Deleteకొంచెం అంటే చాలా కొంచెం అసంతృప్తి,కొద్దిగా అంటే చాలా కొద్దిగా వేదన,కూసింత నిస్సహాయత ,బోలెడంత ఆనందం,పట్టరానంత ఆవేశం మీకు లభించు గాక! అప్పుడే కదండి మరి కవిత్వం ప్రతిఫలిస్తుంది? Jokes apart, చాలా బాగుంది.
ReplyDeleteఅన్నింటితో పాటు కొద్దిగా మీ అభినందనలు కూడా వాటికి తోడవుతాయ్,.ధన్యవాదాలు వెన్నల గారు,.
Delete