Pages

14 July 2013

బ్రోకెన్ హార్ట్


స్పష్టతలేని సంకేతాలు కొన్ని,
అంది అందక,.వస్తూపోతూ
ఇబ్బంది పెడుతున్నప్పుడు,

కనురెప్పల మాటున,
నీకు మాత్రంమే అర్థమయ్యేలా,
ఓ దిగులు మేఘం కదుల్తుంటే,.

ఓరుసుకుపోతున్న,
రెండు కాలాల మధ్య,
నింపాదిగా నిలబడి,
ఓర్పువహిస్తున్నావా ?

కాలధారలననుసరిస్తూ,
రక్తగీతపు ఆనవాలు,
ప్రతిక్షణము జ్ఞప్తికొస్తు,
గుండెలోతున ప్రతిధ్వనిస్తే,.
రగులుతున్న సెగలనన్ని,
                                                     నొక్కిపెట్టి నటిస్తున్నావా,..??

4 comments:

  1. Broken heart అని ఇంగ్లీష్ పేరు బదులు విరిగిన మనసు అని ఈ కవితకు పేరు పెడితే అంత బరువు రాదంటారా కవిగారూ దయచేసి ఒకసారి ఆలోచించండి!

    ReplyDelete
  2. అవునండి,.తెలుగు శీర్షిక వుంటే బావుండేది,.మీ సూచనకు ధన్యవాదాలు,..సరదాగా రాయడమే కాని కవిత్వం గురించి నాకంతగా తెలియదండి,.కవిగారు అనదే నా స్థాయికి చాల పెద్దమాటమే,..

    ReplyDelete
  3. Replies
    1. ధన్యవాదాలు ఆకృతి గారు,..

      Delete