పరాయిదేశానికెల్లిన
ప్రతోడు,.
డాలర్ల పంట
పండించేస్తున్నాడని,
పక్కిల్లల్లో
పొరుగోల్లందరు,
పొల్లిపొల్లి
ఏడుస్తూ,
కుళ్లిపోతున్నారనే,.
కాన్ఫిడెన్షియల్
సమాచారం,
కుదిపేయడంతో ,కమిటి
ఒకటేసి,
చేతులుదులుపుకుంది,.
ప్రభుత్వం.,
అమెరికా, సింగపూర్
ఆస్ట్రేలియా,కెనడా
న్యూజిలాండ్,తైవాన్
ప్రజల డబ్బుతో,
ప్రతిదేశాన్ని
పరిశీలించి,.
సభ్యులు సంతోషంగా,.
ఉత్తమోత్తమ
ప్రతిపాదనొకటి,.
మోసుకొచ్చేసారు,.
దేశపు తలరాతను
క్షణాల్లో మార్చే
ఉపాయం,.
ప్రతి ఇంట్లో
డాలర్లు,
కళకళలాడే సదుపాయం,.
బిచ్చగాడి
బొచ్చకూడా,
డాలర్లతో గలగలలాడే
అవకాశం,..
కరెన్సీ కొత్తమేకప్
తో వచ్చేస్తుందిక,.
""ఇండియన్ డాలర్ "" గారూపు
మార్చుకొని,..
వాట్ ఎన్ ఐడియా
సర్జీ,..
:)))) ..హా హా హా! బాగుంది వారి ప్రతిపాదన.
ReplyDeleteధన్యవాదాలు వెన్నల గారు,.
Delete:)))
ReplyDeleteలాస్య రామకృష్ణగారు ధన్యవాదాలు,.
Deleteఐడియా అదిరింది :-)
ReplyDeleteధన్యవాదాలు పద్మార్పిత గారు,..కాని మన రూపాయి చరిత్ర చాల గొప్పదండి,..నాకైతే రూపాయంటేనే ఇష్టం,..
Delete