Pages

28 July 2013

విలోమగీతం


గాలికెదురుగా ఎగిరే పక్షులు,.
పక్షులా ఆ రెండు రెక్కలు,.
గాలి గుండెను చీల్చినప్పుడు,.
గాయపడినా గాలివేదన,.
విన్నవా,.నువ్వెప్పుడైనా,....

వట్టిపోయిన ఏటిలోన,.
నీటిధారల జాడకోసం,..
ఎదురుచూసి, ఎదురుచూసి,.
ఎండిపోయిన శిలల దుఃఖం,..
అనుభవించవెప్పుడైనా,....

నింగనొదిలి, నేలరాలి,...
ఛిధ్రమైన మేఘమాలిక,
చావు కష్టం,.కళ్లారాచూసి,..
అంతులేని ఆకాశ రోదన,.
ఛాయనైన, కలగన్నవా నువ్వు,..


3 comments:

  1. Ramesh Gaddamidi,. వట్టిపోయిన ఏటిలోన,.
    నీటిధారల జాడకోసం,..
    ఎదురుచూసి, ఎదురుచూసి,.
    ఎండిపోయిన శిలల దుఃఖం,..
    అనుభవించవెప్పుడైనా,....
    chaala bagundhi,...

    Sasi Sri,... bagundi

    Ramana Murthy Venkata,.... aah...adbhutam saar !

    Kavi Yakoob,.. గాలికెదురుగా ఎగిరే పక్షులు,.
    పక్షులా ఆ రెండు రెక్కలు,.
    గాలి గుండెను చీల్చినప్పుడు,.
    గాయపడినా గాలివేదన,.
    విన్నవా,.నువ్వెప్పుడైనా,..../JAYAHO!

    కవిసంగమంలో ఈ కవితకు వచ్చిన కామెంట్లు,.

    ReplyDelete