మబ్బుల్ని తరిమేసి
తడిచిన పచ్చికపైన,,.కూర్చొని
అప్పుడు,. ఆ
ఏకాంతవేళ
వెన్నెల్లో మెరుస్తూ,.
కవితాకాగితాల
కట్టలు ముందేసుకోని,
నెమ్మదిగా
ఒక్కొక్కటి చించుతూ,..
చిరాకుని
కనబడనివ్వని,
ప్రశాంతమైన
చిరునవ్వుతో,..
అంటుంది తను,..
నువ్వు రాసేదేది
కవిత్వమే కాదంటే,.
నువ్వు రాసేదంతా చెత్తంటే,..
నువ్వేమంటావ్,
ఇప్పుడు అని,..
నాకు తెలుసు,.
కవిత్వం గురించి
నాకేమి తెలియదని,
రాయడం,.నాకెప్పటికి చేతకాదని,.అంటూ,.
కాస్తంత దగ్గరకు
జరిగి,.
తన నుదిటిని
ముద్దాడి,.
ఇలా అంటానప్పుడు,.
నేను రాయగల అతి
గొప్ప కవిత్వం ఏదైనా వుంటే,.
అది ఇది
మాత్రమేనని,...
మీ పలకరింపు మరంత తీయగా వుంది,..ధన్యవాదాలు వెన్నల గారు,..
ReplyDeletethank you,.thanooj
ReplyDelete