@ఇక కవిత్వాన్ని
వదిలేద్దామనుకుంటున్నాను గురువు గారు ,
#నాలుగు మాటలు చెప్తాను,
.వింటావా నాయానా,.
@చెప్పండి స్వామి,.మీరంతకంటే
చేయగలిగేదేముంది కాని,..
# వేసుకున్నంత సులభంగా,
తీసిపారెయ్యడానికి
అదేమన్నా భుజాన కండవా అనుకున్నావా,.
కవిత్వం కన్నా కవిత్వం అది,.
@ ఇక,రెండో మాట చెప్పండి, స్వామి
# కూరుకుపోవడం తెలుసా ఊబిలో,.
బయట పడాలని ప్రయత్నేంచే కొద్ది,
మరంత లోతుగా, మరంత బలంగా,
ఇరుక్కుపోతావ్,లొపల్లోపలే,.
ఇక మిగిలింది,.మునిగిపోవడమే,...
@అంతేనంటారా స్వామి,..అయితే,..మూడో మాట
చెప్పెయండిక,..
# పద్మప్యూహం గుర్తుందిగా,..
ప్రవేశమే కాని,.మరలరావడం వుండదు,.
కవిత్వమూ అంతే,.
అంటించుకోవటం తప్ప,
వదిలించుకోవడం వుండదు,..
కడతేరిపోవడమే కాని,
కళ్లు తెరుచుకోవడం వుండదు,.
@దిస్ ఈజ్ టూ మచ్ గుగా,..
కళ్లు తిరుగుతున్నాయ్ నాకు,.
చివరిది చెప్పండిక,..వెళ్తాను,..
# కాష్మోరాని ప్రయోగించాడా,..చెప్పు,.
క్షణంలో వదలకొడతాను,.
కవిత్వం ఆవహించాక,.
ఏ కాద్రాలు
కాపాడలేడు,..
వాడి ఖర్మకి వాడ్ని వదిలేయడం తప్ప.,.
చివరి సీన్ - పడిపోయిన శిష్యుడి మొఖం మీద నీరు చిలుకరిస్తున్న
గుగా,..
note,. కాద్ర ,. తులసీ నవలలో మంత్రగాని పేరు,..
No comments:
Post a Comment