@ గురువు గారు,,నాకవిత్వానికి ఓ
బ్రాండింగ్ కావాలి స్వామి,.
లేకుంటే పక్కన బాండ్ వేసేటోళ్లు దొరకడం లేదు,.
# రెండు ముద్రలు సిద్దంగా వున్నాయిరా ,శిష్యా
నీ కోసం,..
@ సెలవియ్యండి
స్వామి,..ఆత్రుతగావుంది,.నాకు,..
# మొదటిది,,.
స్వతహాగానే నువ్వు నకవిత్వవాదివి,,,.
@ అంటే ఏంటి స్వామి,.
# రాసేదాంట్లో కించిత్కవిత్వమేమి
లేకపోయినా,,.
కవిత్వమని భ్రమ పడేవాళ్లంతా ఈ వాదులే నాయనా,,.
@ ఆహా,..ఏమీ చెప్పారు గుగా,,..
రెండో ముద్ర గుద్దేయండింక, త్వరగా,.. ప్రచారానికెళ్లాలి,..
# కవిత్వాన్ని నిరసిస్తూ కవిత్వం రాయడం నాయనా,..
అందంతా కవిత్వ నిందా వాదం,.షార్ట్ కట్లో అది కుకవిత్వంశిష్యా,..
@ మహా సంతోషం గుగా,.,.నాకూ రెండు
బ్రాండ్లతో,
కొత్త ఇమేజీని ప్రసాదించినందుకు,..
నీ నిరంతర నకవిత్వ,కుకవిత్వవాద కవిత్వంతో వర్ధిల్లు నాయానా,...
No comments:
Post a Comment