1
నిదానంగా బాధ తొలిగిపోతు,..
ఆ స్ధాన్నాన్ని జాలి ఆక్రమిస్తుంది,..
నన్ను ప్రేమించిన నీ మీద,
నిన్ను ప్రేమించిన నా పైన,.
2
మిగిలిన గుర్తులను ,
చిక్కుముడుల్లాంటి ముద్రలను,
జాగ్రత్తగా తుడిచేసుకుంటూ,.విప్పుకుంటూ,
చెలరేగిన తేనటీగల్లా చుట్టుముట్టి,
కసిగా కన్నీటిని పీల్చేస్తున్న,
నీ జ్ఞాపకాల్ని విదిలించుకుంటూ,.
ఇన్ని గాయాల మధ్య,
ఎంత మామూలుగా వుందామన్నా,.
హృదయాన్ని శిలను చేస్తూ,.
క్షణక్షణానికి సాంద్రమైపోతూ,.
ఘనీభవిస్తున్న ఆలోచనల్లో,
బంధీనైపోతూనే వున్నానిక్కడ.
3
వలపు విలాసం,.విలాపమైన
నా విషయంలోనూ అదే సత్యమైనా,
ఇంత బాధలోనూ,.
అంత జాలి జడివానలా కురుస్తున్ననప్పుడు,
నాకెందుకో,
ఇంకా తడుస్తున్నట్లేవుంది,.నీ ప్రేమలో.
బాగున్నాయి మీ కవితలు
ReplyDeleteతెలుగమ్మాయ్ గారు, ధన్యవాదాలండి,.
Delete"ఇంత బాధలోనూ,.
ReplyDeleteఅంత జాలి జడివానలా కురుస్తున్ననప్పుడు,
నాకెందుకో,
ఇంకా తడుస్తున్నట్లేవుంది,.నీ ప్రేమలో"chala bagundhi
చిన్ని.వి గారు, మీ స్పందన ఆనందంగా వుంది,.మీకు నచ్చినందుకు ధన్యవాదాలండి,.
Deletebagundandi chalabagundi
Deleteధన్యవాదాలు అజ్ఞాత గారు,.
Delete