Pages

5 August 2013

ఒక చెట్టు(పిట్ట) కథ


1
దప్పికతీరక,అనునయించే తోడు దొరకక,.
కూతరాని బక్కచిక్కిన పిట్టలా,
నావైన కొన్ని హృదయాల కోసం,.
అయెమయంగా ఎగురుతున్నప్పుడు,..
అలసిపోయి,.సొలసిపోయి,
బిక్కుబిక్కుమంటూ అడుగుపెట్టి,..
నిలబడినాక, ఇక్కడ,... అర్థమైంది,.
గువ్వలాగ ఒదిగిపోవడానికి,..
అమ్మవడి లాంటి చోటిదని,..

2
దిగ్గజాల మధ్య దిక్కుతోచక,
భయంతో బిత్తరచూపులు చూస్తున్నప్పుడు,..
దయగలిగిన చూపులు,..
అమృతాలను కురిపించాయి,..
కొన్ని చేతులిక్కడ వంతెనలైనాయి,..
దారి చూపే దివ్వెలైనాయి,..
ఒక్కో అడుగుకి,.. తోవచూపుతూ,.
స్నేహితుల్లా మారి,.. పయనానికి తోడైనాయి,.

3
గుండెల్లో తడింకా ఆరలేదు,.
చకచక తొక్కుకుంటూ,..
ఇంకాస్తా ఎదగడానికో,..
శిఖరాలను చేరడానికో,..
నిన్నోక  మెట్టు లాగా చూడడానికి.

పచ్చని ఆకుల మధ్య,.
వెచ్చని ఓ గూడు కట్టుకొని,..
చెమ్మ గలిగిన హృదయాల మధ్య,.
తలదాచుకోవడానికి,.
ఓ పవిత్రమైన  తావిది,..

ఏ ఆంక్షలులేక,.. ప్రతి ఆకాంక్షకు
కావలసినంత నీడనిచ్చి ఆదరించిన,.
నిజమైన కవిత్వపు అసలైన చెట్టిది,..


No comments:

Post a Comment