వాడుక భాషా గొడుగు,.గిడుగు వెంకటరామమూర్తి ,. మరియు హాకీ మాంత్రికుడు ద్యాన్ చంద్ , ఇద్దరు మహానుభావులకు,.. జన్మదినోత్సవ శుభాకాంక్షలు.
తెలుగులో వాడుక భాషా ఉద్యమ పితామహుడు, గిడుగు వెంకట రామమూర్తి. గ్రాంధికభాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుకభాషలోకి తీసుకు వచ్చి, నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్నీ, వీలునూ తెలియజెప్పిన మహనీయుడు. ఆంధ్రదేశంలో వ్యావహారిక భాషోద్యమానికి మూలపురుషుడు. బహుభాషా శాస్త్రవేత్త, చరిత్రకారుడు, సంఘసంస్కర్త, హేతువాది. శిష్టజన వ్యవహారికభాషను గ్రంథరచనకు స్వీకరింపజేయడానికి చిత్తశుద్దితో కృషిచేసిన అచ్చతెలుగు చిచ్చర పిడుగు గిడుగు. గిడుగు ఉద్యమంవల్ల ఏ కొద్దిమందికో పరిమితమైన చదువు వ్యావహారికభాషలో సాగి, అందరికీ అందుబాటులోకి వచ్చింది. పండితులకే పరిమితమైన సాహిత్యసృష్టి, సృజనాత్మకశక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ వీలైంది.గిడుగురామ్మూర్తి జయంతి ఆగష్టు 29 ని “తెలుగు భాషా దినోత్సవం” గా జరుపుకుంటున్నాము. (సేకరణ,. వికీపిడియా)
గిడుగు గారి గురించి,..చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్తిగారు,.
"ఏమైనా అభిమానమంటూ మిగిలిన ఏ పండితుడైనా, కవియైనా తన బిరుదాలూ పతకాలూ అన్నీ రామ్మూర్తి పంతులు గారికి దోసిలొగ్గి సమర్పించుకొని మళ్ళీ ఆయన అనుగ్రహించి ఇస్తే పుచ్చుకోవలసిందే"
"ఏమైనా అభిమానమంటూ మిగిలిన ఏ పండితుడైనా, కవియైనా తన బిరుదాలూ పతకాలూ అన్నీ రామ్మూర్తి పంతులు గారికి దోసిలొగ్గి సమర్పించుకొని మళ్ళీ ఆయన అనుగ్రహించి ఇస్తే పుచ్చుకోవలసిందే"
హాకీ మాంత్రికుడు ద్యాన్ చంద్
పిల్లల్లో తగ్గిపోతున్న భాషాసక్తి,, క్రీడాసక్తిని పెంపొందింపచేసేందుకు,.
తెలుగు మాట్లాడదాం,..,చదువుదాం,..,రాద్దాం,.
ఆటస్థలానికెళ్ళి కొద్దిసేపైన ఆటలాడదాం,.పిల్లలతో,..
తెలుగు మాట్లాడదాం,..,చదువుదాం,..,రాద్దాం,.
ఆటస్థలానికెళ్ళి కొద్దిసేపైన ఆటలాడదాం,.పిల్లలతో,..
No comments:
Post a Comment