నీరెండలో మెరుస్తున్న ఆ చెట్టు,
నిలదీస్తున్నట్లు లేదు, నిన్ను.
నిన్నటి దాకా,
ఏ స్వార్ధాలకో బలైన
వేలాది సోదరుల సాక్షిగా,
స్తూపమై నిలిచినట్లుగా వుండేది కదా అది.
తనువునంతా చీల్చి,
ఈ మనిషికి బతుకునిచ్చి,
బజారున పడిన తల్లిలా లేదూ, అది.
మాయమాటలు నమ్మి,
మోసపోయి, సర్వస్వమర్పించి,
ప్రాణాలోదిలిన చెల్లిలా లేదూ, అది.
అత్యాశా కత్తులతో నరకబడి,
నిలువునా కూలిన ఆ చెట్టు,
నిర్జీవంగా అలా ఆ రోడ్డు పక్కన,
నీరెండలో మెరుస్తూ,
నిన్ను నిలదీస్తున్నట్లు లేదూ, అది.
nijam ga nilateestunnatte undandii........chala baundi bhaskar gaaru..... manchi kavita
ReplyDeletethank you sitha garu.
Deleteమంచి ప్రయోజనకరమైన ఆలోచనాత్మకమైన కవిత.పర్యావరణ ప్రేమికులందరికీ నచ్చే కవిత.
ReplyDeletethank you sekhar.
Deleteyour appriciation make my day happy.
పుష్ప విలాపం లాగా చెట్టు విలాపం మీరు రాసేసారు! బాగుందండి!
ReplyDeletemeerante gani gurthuku raledandi, lekapothe vruksha vilapam raadhunu.
Deletethank you, vennela garu.