Pages

4 September 2012

మౌన రోదన


నాలోకి నేను
తొంగి చూసుకున్నప్పుడల్లా,
అప్పుడే విచ్చుకున్న పువ్వుల్లా,
నీ జ్ఞాపకాలు గుభాళిస్తునేవుంటాయ్,.
నన్ను నేను ప్రశ్నిచుకున్నప్పుడల్లా,
నీ నవ్వులు జలపాతపు హోరై,
నా నోటిని మూయిస్తునే వుంటాయ్,.
నాకర్థం కావని,
దూరంగా నెట్టేసినప్పుడల్లా,
లీలగా నాకేదో
అర్థమవుతావనిపిస్తుంది,
నాకేదో అర్థమైందని,
హత్తుకున్నప్పుడల్లా,
నా అజ్ఞానాన్ని ప్రశ్నిస్తూ,
మౌనంగా నిష్క్రమిస్తావనిపిస్తుంది.
అన్నీ ఇచ్చినపుడు,
దేనిని పొందాలనుకోలేదు.
ఇక్కడేమి లేనపుడు,
అన్ని కావలనుకుంటాను,
ఎంత అవివేకినో కదా నేను.
నీకేం కావాలో,
నాకేమీ తెలియనప్పుడు,
నేనేం తీసుకోవాలో,
నాకే చేతకానప్పుడు,
ఏ ప్రశ్నకు నా దగ్గర,
సమాధానం లేనప్పుడు,
నువ్వు మాత్రం
చేయగలిగినదేముంది, సుమా!!
మౌనంగా రోధించడం తప్ప.

4 comments:

  1. ఏంటండీ ఇంత వేదన??

    ReplyDelete
  2. చక్కని భావాలు...
    నన్ను నేను ప్రశ్నిచుకున్నప్పుడల్లా,
    నీ నవ్వులు జలపాతపు హోరై,
    నా నోటిని మూయిస్తునే వుంటాయ్,.
    చాలా బాగుంది...
    అభినందనలు భాస్కర్ గారూ!
    @శ్రీ

    ReplyDelete
  3. భాస్కర్ గారూ , కవితాభావన బాగుంది, పదాల పొందిక చక్కగా అమరింది.

    ReplyDelete
  4. భాస్కర్ గారూ , కవితాభావన బాగుంది, పదాల పొందిక చక్కగా అమరింది.

    ReplyDelete