Pages

22 September 2012

నేనెలా నిష్క్రమించగలను, సుమా....

అలలుఅలలుగా,
తెరలుతెరలుగా,
ఏ వెన్నల నవ్వులైతే,
అలా పరుచుకుని,
ఈ శూన్య హృదయాన్ని,
జీవజలంతో నింపుతాయో....
నా ఆనందాలన్నింటిని మోసుకొని,
ఏ మోము అయితే,
ఈ చుట్టుపక్కలే తిరుగుతూ,
ఉల్లాసాన్ని నాపై పన్నీరులా చిలుకరిస్తుందో.....
అలాంటి, నీ సమక్షాన్ని వదలి,
నేనెలా నిష్క్రమించగలను, సుమా....
నేనిక్కడనుంచి.

2 comments:

  1. శూన్య హృదయం , ఆనందం ఇవి ఆత్మ తత్వానికి ప్రతీకలైతే , ఆ ఆత్మ తత్వం , తనకు నవ్వులూ , ఉల్లాసం నేర్పిన జీవుడిని విడిచి వెళ్ళలేను అన్నట్లు గా ఉంది మీ కవిత , మంచి భావన !!

    ReplyDelete
  2. కల్యాణ్ గారు, నా బ్లాగుకి స్వాగతం, మీరు ఎంత గొప్పగా ఆలోచిస్తారో,
    మంచి పోలిక.

    ReplyDelete