Pages

2 September 2012

అంతరాత్మ - అడ్డదారి


నిశివెలుగు,
పరుచుకున్నబతుకు బాట,
నల్లగా మిసమిసలాడుతూ,
కాంతి వంతంగా మెరుస్తుందిప్పుడు.
గుంటల్లో, మిట్టల్లో
ఎగుడుదిగుడు బాటల్లో,
జీవితం మెత్తగా,సాగిపోతూ....
ఆనందంగా వున్నప్పుడు,
ఇన్ని నసుగుల్లెందుకు,
ఇన్ని ఆలోచనలెందుకు,
వేల అంతరాలెందుకంటావ్ !
 నీకు నాకు మధ్య.

12 comments:

  1. అడ్డదారి.....బాగుందండి.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు ప్రేరణ గారు,

      Delete
  2. బాగారాసారు.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు యోహంత్ గారు, కవిత నచ్చినందుకు.

      Delete
  3. bhaskar gaaru naaku kooda mee andarini choosi rayalani durasa puttindi kevalam meppu kosame.dayachesi meeru telugulo raydam font colours ekkada nundi teesukuntaro cheppagalara?

    ReplyDelete
    Replies
    1. నా కోసం తో మొదలైంది, అలానే వుంటే ఫరవాలేదు కాని, వేరే వాళ్లు చదవడానికి అనే భావం వస్తే,............ చదవడం ఆనందం ఇస్తే,, రాయడం సాధారణంగా రకరకాల కాంప్లికేషన్స్ కి దారితీస్తుందేమో తనోజ్ ,
      రాయడం దురాశ కాదు, అదొక దురద, రాసి రాసి మాత్రమే మరంతగా పెంచుకోగల జిల,
      రాబోతున్న కొత్త కవి/ రచయిత/ బ్లాగర్ కి సుస్వాగతం
      నేను MS WORD తెలుగు టైప్ చేసి, ఇటాలిక్ బోల్డ్ లో పోస్ట్ చేస్తానండి,
      కలర్స్ మీకు వర్డ్/ బ్లాగ్ లో వుంటాయ్.

      Delete
  4. భాస్కర్ గారూ, మొదటి నాలుగు లైన్లు కొత్త ప్రయోగం అనుకుంటాను.
    చివరి నాలుగు లైన్లు అర్ధవంతంగా ఉన్నాయి. బాగా రాసారు...మెరాజ్

    ReplyDelete
  5. ధన్యవాదాలు ఫాతిమా గారు, తప్పులు చేస్తూ, ఒప్పులుగా ఒప్పించుకుంటూ ఆనందంగా బతకడానికి అలవాటు పడుతున్నామేమో.... అనే ఫీలింగ్ , ప్రయోగమేమిలేదండి.

    ReplyDelete

  6. ఇన్ని ఆలోచనలెందుకు,
    వేల అంతరాలెందుకంటావ్ !
    నీకు నాకు మధ్య.
    ఈ భావం బాగుంది భాస్కర్ గారూ!
    @శ్రీ

    ReplyDelete
  7. ధన్యవాదాలు శ్రీ గారు, కవిత నచ్చినందుకు

    ReplyDelete
  8. ఆత్మానందాన్ని మొదటి పంక్తుల్లో చూపించి , ఆత్మశోధన తో ముగించారు . సాధకుని లక్షణాలని అక్షరాలలో వ్యక్తం చేసారు . బాగుంది !!

    ReplyDelete
  9. కల్యాణ్ గారు, మా విశ్లేషణా తీరు ఎన్నో ఆధ్యాత్మిక భావనలను నింపుతుంది, నా కవితను నాకే కొత్తగా చూపుతుంది.
    ధన్యావాదాలండి.

    ReplyDelete