మా సార్
ముళ్ళ పొదల్లో ఇరుక్కున్న
నా ఆలోచనలకు
వెలుగు బాటను చూపి ,
తానక్కడే మిగిలి పోతాడు.
తన స్వప్నాల్ని
నా బుర్ర లోకి నెట్టి
నిశ్శబ్ధం గా నలిగి పోతాడు.
నా జీవితాన్ని
నా చేతుల్లో పెట్టి
నా వంక చూడకుండానే
వెళ్లి పోతాడు.
నా లక్ష్యం, నా మార్గం,
నా స్వప్నం, నా జ్ఞానం,
అన్నీ తానై,
మౌనం గా మురుస్తూ ,
మనసులో మెరిసిపోతాడు.
ఓ జ్ఞాపకం గా మిగిలి పోతాడు.
చాలా బాగుంది భాస్కర్ గారూ!
ReplyDeleteమీకు గురు పూజోత్సవ శుభాకాంక్షలు...
@శ్రీ
శ్రీ గారు ధన్యవాదాలు,కవిత నచ్చినందుకు
Deleteచాలా బాగుందండీ.. మీకు కూడా గురుపూజా దినోత్సవ శుభాకాంక్షలు.
ReplyDeleteశుభ గారు,కవిత నచ్చినందుకు ధన్యవాదాలు,మీకు కూడా గురుపూజా దినోత్సవ శుభాకాంక్షలు.
Deleteగురువు గురించి చక్కగా చెప్పారండీ!
ReplyDeleteమీకు కూడా టీచర్స్ డే శుభాకాంక్షలు..
రాజీ గారు, కవిత నచ్చినందుకు ధన్యవాదాలు,మీకు కూడా టీచర్స్ డే శుభాకాంక్షలు..
ReplyDelete