కుక్క
పిల్ల, అగ్గి
పుల్ల, సబ్బు
బిళ్ళ
హీనంగా
చూడకు దేన్నీ,
జ్ఞానాన్ని
పంచేవేనోయ్ అన్నీ!
రొట్టె
ముక్క , అరటి
తొక్క, బల్ల
చెక్క
నీ వేపే
చూస్తూ ఉంటాయ్!
తమ లోతు
కనుక్కోమంటాయ్!
తలుపు
గొళ్ళెం , హారతి
పళ్ళెం, గుర్రపు
కళ్ళెం
కాదేది
సైన్సు కనర్హం!
ఔనౌను
జ్ఞానమనర్ఘం!
ఉండాలోయ్
పఠనావేశం!
ప్రయోగమే
పథ నిర్దేశం!
జీవితమే
విజ్ఞానం కోసం!
కళ్లుంటే
పరిశీలించి
మెదడుంటే
ఆలోచించి,
చేసి
అనంత
విశ్వం పద్మవ్వూహమ్
విజ్ఞానమొక
తీరని దాహం !
(మహా కవి
శ్రీ శ్రీ గారికి క్షమాపణలతో)
"ఉండాలోయ్ పఠనావేశం!
ReplyDeleteప్రయోగమే పథ నిర్దేశం!
జీవితమే విజ్ఞానం కోసం!"
నిజమేనండి.. బాగుంది