Pages

26 May 2012

కవి అను నేను.........


దరిద్రాన్ని,  దైవత్వాన్ని
సంపదల్ని, సైతానుల్ని
విషాదాన్ని, విస్మయాన్ని
కమ్మని కలల్ని, కల్లోలాన్ని
కాలకూట విషాన్ని, కేరింతల్ని
ఒకే చోట కలిపి,
కుట్టేస్తాడు, వాడు.

శిధిల శరీరాన్ని, సౌందర్యాన్ని
కాల బిలాల్ని, కరిగే జీవాన్ని
విద్వేషాన్ని, విజ్ఞానాన్ని
సృష్టి రహస్యాన్ని, వినాశనాన్ని
విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని,శతృత్వాన్ని
ఒకే వరసలో కలిపి,
నాటేస్తాడు వాడు.

నీ దేహపు గగనపు పొంగుల్ని,
లోయల్ని, నీటి చెలమల్ని,
వన్నెచిన్నెల్ని,
సముద్రపు లోతుల్ని.
తొలకరి చినుకుల్ని,
ఒకే పాత్రలో కలిపి,
వండేస్తాడు, వాడు.

కన్నీటిని, కవిత్వాన్ని,
రక్తమోడుతున్న దేహాన్ని,
ఒకే కొయ్యకు వేలాడదీస్తాడు, వాడు.

8 comments:

  1. కవితా వస్తువు,అభివ్యక్తీకరణ చాలా బాగున్నాయి. చాలా కవితలని ఇప్పుడే చదివాను.వేరి గుడ్ !
    అభినందనలు.

    ReplyDelete
  2. thank you andi,
    meeru naa kavithalanu chdivi, abhinandinchinanduku,

    ReplyDelete
  3. CHALABAGUNNAI ....BHASKAR GARU

    ReplyDelete
  4. chaalaa baagundi bhaskar gaaru.kadilinchelaa undi

    ReplyDelete