నీకెందుకోయి, కవీ,...కవిత్వం
వదులుకోలేవటోయి, నీవా పైత్యం.
వ్యాకరణాల టక్కు టమారం,
వృత్తగంధీ వచనపు సొగసులు,.
వేల శైలులా కవితా శిల్పం,
విభిన్న రీతుల కావ్య లక్షణం,.
గణాల,గుణాల గందరగోళం,
చంధస్సు,యతి ప్రాసల గరళం,.
తెలుసా నీకేమైనా,
తొంగి చూసావా,అటు...నీవెపుడైనా...
నీకెందుకోయి, కవీ,...కవిత్వం
వదులుకోలేవటోయి, నీవా పైత్యం.
స్వప్నలోకపు స్వేచ్ఛాయానం,
యధార్థజగత్తు దుఃఖపు గానం,
కొట్టుకొచ్చిన సృజనాత్మక రాతలు,
ఎత్తుగడలల ఎత్తులలోన
కూరుకుపోయిన అసలు రహాస్యం,
ధగధగ మెరసే కవుల తలలకు
వెనకనవున్న ఎన్నో సొట్టలు,
తెలుసా నీకేమైనా,
తొంగి చూసావా,అటు...నీవెపుడైనా...
హెర్బర్ట్ రీడ్ సర్రయలిజం
అధివాస్తవికత అయోమయం
కొత్తపుంతల ప్రాహ్లాద కవిత్యం,
క్రోపాట్కిన్ అనార్కిజం,
బుఖారిన్ చారిత్రక బౌతికవాదం,
విశాల విశ్వపు సిద్ధాంతాలు,
పిచ్చెక్కించే పదబంధాలు,
తెలుసా నీకేమైనా,
తొంగి చూసావా,అటు...నీవెపుడైనా...
కవుల గుంపుల కుళ్లు,అసూయలు
కృత్రిమ వెలుగుల చీకటిరాజ్యం,
విమర్శకత్తుల కరాళ నృత్యం,
తోటి కవులను తొక్కేసే వైనం,.
ప్రచురణకర్తల కళావిలాపం,
మిగిలిపోయినా కట్టలగుట్టలు,
ఫుట్ పాతుకి చేరే విషాదసత్యం,
తెలుసా నీకేమైనా,
తొంగి చూసావా,అటు...నీవెపుడైనా..
జీవితకాలపు వ్యర్ధప్రయత్నం,
ఎందుకు నీకీ అమాయకత్వం,
సిద్ధించదులే నీకమరత్వం,,.
నీకెందుకోయి, కవీ,... ఆ కవిత్వం
వదలుకోలేవటోయ్,. నీవా పైత్యం
ఈ కవిత నేను పూర్తిగా అర్ధం చేసుకోలేకపోయాను. కాని overall gaa what you are conveying via this poem అది అర్ధం అయ్యింది....:)
ReplyDeleteక్రోపాట్కిన్,,బుఖారిన్, హెర్బర్ట్ రీడ్,సర్రయలిజం,అధివాస్తవికత ప్రాహ్లాద కవిత్యం, అనార్కిజం చారిత్రక బౌతికవాదం,వీటికి ఫుట్ నోట్ ఇవ్వవలసిందండి,.పూర్వకాలంలో పద్యాల మధ్యలో వచనాని వృత్తగంధిలో రాసేవారట,సరదాగా నాతో నేను వేసుకున్న ప్రశ్నలేనండి ఇవన్ని,మొదటి వాక్యం మాత్రం మా నాన్న, మా ఆవిడ రోజు అనేదే,.నీకెందుకు కవిత్వం అని,.హ.హ,.
Deleteఅసలు కవిత ఎలా వుందో చెప్పలేదండి, మీరు, ధన్యవాదాలు వెన్నల గారు,.
కవి అయి ఉండి ఇలా అడగడం కాదు భావ్యం:-)
ReplyDeleteహ,హ..పద్మార్పిత గారు నేను ఎవరిని ప్రశ్నించలేదండి, ఇదంతా స్వగతం,...మీరు భావ్యం కాదన్నారు కాబట్టి ఇక నన్నునేను కూడా ప్రశ్నించుకోనండి ఇక,..చదవి స్పందించినందకు ధన్యవాదాలండి.
Deletesuperb man.
ReplyDeleteధన్యవాదాలు తనోజ్,.అభిమానంతో స్పందించినందుకు,...
Deleteముందు మనసు స్పందనకు యేవో కొన్ని పదాలను కూర్చుకుని సంతృప్తి పడతాము.మరో రోజు తీరిగ్గా కూర్పుని చదువుకుని ఆ పదం ఈ పదం బాగో లేదని మార్పులు చేస్తాము . చ్జివరకి వ్రాశిందేది బాగోలేదు అనుకుని అంతా మార్చి సరిక్రొత్తగా మళ్ళీ వ్రాస్తాము. తరువాత తెలుస్తుంది ఎవరో ఒకరు "అరె బాగుందే! "అని అంటే అప్పుడు తెలుస్తుంది ఓహో అది కవిత్వమా అని తరువాత తరువాత ఇలా అలవటయ్యి కవి అనిపించుకుంటాము. కొత్త దానం కోసం పాకులాడడం, గుర్తింపు కోసం ప్రయోగాలు చెయ్యడం అన్నీ అయ్యాక సాహిత్యం వైపు చూడ్డం ప్రారంభిస్తాము పలువురి ప్రఖ్యాతుల పాత వ్రాతలను చూడ్డం మరో పదిమంది సమకాలీకులను చదవడం ఆపై మనకూ ఓ ఉనికి వుంటే బాగుంటుందని అటుగా ప్రాకులాడడం ఇవన్నీ మనకు తెలియకుండానే జరిగిపోతూ వుంటాయి .మన కోసం మాత్రమే వ్రాసుకోవడం మానేస్తే మనకు ఇలాంటి ప్రకోపాలన్నీ అంటుకోక తప్పదు. శైలి, ఇజం, వ్యాకరణం, ప్రయోగం ఇవన్నీ ఎవరి మెప్పు కోసమో చెయ్యడం ప్రారంభిస్తే మనకు ఏదైతే ఎంతో సంతృప్తిని ఇస్తుందో అదే ఎంతో తలనొప్పి గా మారుతుంది. హాయిగా అన్ని భందనాలను వదిలి స్వేచ్చగా మన కోసం మనం వ్రాసుకుంటే ఎంతో ఆత్మ సంతృప్తి దొరుకుతుంది
ReplyDelete