పురిటినొప్పల తల్లి
గుడ్డి దీపపు గుడిసె
ఆరుబయట తాగి, తూలుతుండే
అర ఎకరపు మెట్టతండ్రి.
బోసినవ్వుల బిడ్డ
భూమి పైకి వచ్చే
రెండు కొమ్ముల బిడ్డ
వెనుక తోక తోటి.
వారసత్వముగా అబ్బే
సంకుచితమనే జబ్బు
ఎంత పేద అయిన
వాడు O.C బిడ్డ
వాడు చిన్ని బతుకు
వోటి కుండే అయిన
ఎవడికి పట్టని
ఆ బిడ్డ O.T బిడ్డ
super ga raasaru.
ReplyDeletethank you padmarpita garu...
ReplyDelete