Pages

7 January 2013

ఒక దారి కోసం



ఏది గమ్యం ఏది సత్యం
మిత్రమా నాకేది మార్గం
వేల వలలు పరచబడినవి
అనంత దుఃఖపు లోతులున్నవి
శిఖరమల్లే సంతోషమున్నది
అంతులేనివై ఆశాపాశం
శృంఖలాలై బంధించుచున్నవి,.
ఏది సత్యం ఏది గమ్యం
మిత్రమా నాకేది మార్గం
రాగద్వేషం లోకపురీతై
ప్రపంచమంతా కదనరంగమై
అహంకారమే కాలసర్పమై
కదలికలేని కభోధినైతిని
వెలుగులు ఎరుగని  నిశిధినైతిని
ఏది మోహమో, ఏది మోక్షమో
కనుగొనలేక కన్నీరు కార్చితి.
నన్ను నన్నుగా నిలిపే మంత్రం
సర్వబంధాలు ఛేదించే తంత్రం
ఎండమావులై మిగిలిన వైనం
ఏది గమ్యం ఏది సత్యం
మిత్రమా నాకేది మార్గం.

2 comments:

  1. hahahaha nenanduke intelligent gaa alochinchadam manesaaaaa

    ReplyDelete
  2. తనోజ్ గారు, ఆలోచన మానుకోవడం మన చేతుల్లో లేదేమో,..నిజానికి ఆలోచన అనుభవానికి అడ్డం లాంటిదే అనుకుంటా చాలాసార్లు

    ReplyDelete