దృతరాష్ట్రుని బిగి పరిరమ్భము
ధీర్ఘకోశికై, ధూమధ్వజుడై
దిగ్గునలేచి, దగ్ధమైనది.
వర్త్యము నిండా పిసాళి కక్షము
పుష్పమంజరై, పులిపెంజరమై
రిరక్షవునకు దుర్భరమైనది.
కీకారణ్యం కుళ్లబొడుస్తు
చెత్తకుప్పలో కుళ్లిన శవమై
పదాల సంగతి ఏమోగాని,
భావం మాత్రం భేతాళుని ప్రశ్నే.
అర్ధ అర్ధమే అద్భుతమంటూ,
స్పష్టత ఎందుకు వ్యర్ధం అంటూ
వివేకవంతుని జ్ఞానపు గీతం
అల్పునికెపుడు అర్థం కాదు.
hahah chivari 6 lines thappa nijmgane naku ardamkaledu andee(ofcourse manaki telugu antha baaga radanukondee)
ReplyDeleteఒక కవిత చదివి అర్ధం కాక పోవడంతో రాసిన కవిత ఇది,
Delete1)పొగడ్త, దృతరాష్ట్రుని కౌగిలి లాంటిది, జలగలాగా విడవకుండా, అగ్ని లా దహిస్తుంది,.
2)దారి నిండా పరుచుకున్న ముళ్లు లాంటి ప్రశంసలు, రక్షించేవాడికి(విమర్శకుడికి)పాములులాగ ఇబ్బంది పెడుతున్నాయి.
3)అరణ్యంలాంటి నిఘంటువులను ఎంత గాలించినా, భావం అర్థం కాకపోతే అది పారేయవలసిన శవం లాంటిది,...తరువాత ఆరు లైన్లతో ఇబ్బందే లేదుకదా,..హ,హ,.సరదాగా రాసింది తనోజ్ గారు,ధన్యవాదాలు ..