Pages

23 November 2012

నిశ్చింత


నవసరపు చింతలు,
కొత్తగా వెతకాల్సిన తత్వమూ,
ఇలాంటివేమి వుండవేమో,.
నిశ్చింతగా వున్న మనిషికి,.
మారాలనుకునే వాడు,
సదా మార్పుకోరుకునే వాడు,
నిరంతర విచారణలతో తర్కించేవాడు,
ప్రశ్నిస్తూ, సమాధానాలు అన్వేషిస్తు,
అభివృధ్ధికై శ్రమిస్తు, తపిస్తూ,
చలిస్తు, జ్వలిస్తూ,
మూలమూలల్ని జల్లిస్తు,
వెతికేస్తుంటాడు,నిశ్చింతకై,.
అసలైన సత్యం అదేనంటూ,
దాన్నెప్పటికీ చేరుకోలేక, అందుకోలేక,
ఆవేదనతో ,అదే చింతతో వెళ్లిపోతాడు,.

8 comments:

  1. ఇంతకీ నిశ్చింతగా ఉండాలా లేక తర్కించి శోధించాలా!!:-)

    ReplyDelete
    Replies
    1. అదే పద్మార్పిత గారు, అర్ధం కావడం లేదు,.మనసు నిశ్చింతకి, జీవితం అన్వేషణకి పంచేయండి,.ధన్యవాదలండి,.

      Delete
  2. chalaa baagundi bhaskara gaaroo!....shodhana saaginchandi...@sri

    ReplyDelete
    Replies
    1. శ్రీ గారు, మీ లాంటి మంచి మిత్రుల ప్రోత్సాహమే నా రాతలకు స్ఫూర్తి, థన్యవాదాలండి

      Delete
  3. man canot live by bread alone .but, yeah i too believe human life is somewat miserable

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదలు తనోజ్,..చింతను,నిశ్చింతను వేరు చేసేదొకటుంది,...సంతృప్తి.

      Delete
  4. Replies
    1. అంతేనంటారా,...ధన్యవాదాలు మంజు గారు,.

      Delete