నిన్ను నీవెప్పుడన్నా
,
సంబాళించుకున్నావా ?
ఏ తప్పు
జరుగకుండా,,,,
నిన్ను
నువ్వెప్పుడున్నా,
రక్షించుకున్నావా ?
ఏ లోభము
వశపరుచుకోకుండా...
నువ్వెప్పుడన్నా,
అలానే నిలబడ్డావా ?
ఏ ఉప్పెనో నీపైకి
దూకినప్పుడో,
నిను మొత్తంగా
ముంచేస్తున్నప్పుడో...
నిన్ను
నువ్వెప్పుడన్నా,
ఎదురొడ్డి
నిలబడ్డావా ?
మోహావేశాలు నీపై
విరామమెరుగని,
దండయాత్రలు
సలిపినప్పుడు
ఇంతకీ ఇప్పుడు
నువ్వు,
నిజం
చెబుదామనుకుంటున్నావా ?
అలవాటైనా అబద్ధాలతో,
తప్పించుకోవడానికి
సిద్ధమవుతున్నావా ?
అలవాటైనా అబద్ధాలతో,
ReplyDeleteతప్పించుకోవడానికి సిద్ధమవుతున్నావా ?
బహుశా ఇదే అయ్యుంటుందండీ :(
హ,హ,.హ....ఏదో సరదా ప్రశ్నలేలేండి సుభగారు,..ధన్యవాదాలు.
Deleteనిజమ్ సెప్పమంతావా అబద్ధమాడమంతావా భాస్కర్ బావ్...
ReplyDeleteబాగుంది బాగుంది...కైతల్తో కుమ్మేయండి..
ఓలమ్మోలమ్మో గారు, ధన్యవాదాలండి.
Deletethought provoking ...good one man
ReplyDeleteప్రశ్నలు నచ్చినందుకు ధన్యవాదలు తనోజ్.
Deleteఅమ్మో ఇన్ని ప్రశ్నలా? ఊహు! నేను సమాధానం చెప్పనండి.
ReplyDeleteహ,హ,..సమాధానాలు అవసరం లేదులేండి, వెన్నల గారు, మీరిలా తొంగి చూస్తుటే చాలు...
ReplyDelete