పి.రామకృష్ణ // ఎప్పట్లాగే
గుప్పెడు గింజల్నీ,
గిన్నెడు నీళ్ళనీ-
గుప్పెడు గింజల్నీ,
గిన్నెడు నీళ్ళనీ-
పిట్టగోడపై వుంచి
ఎదురుచూస్తున్నాను.
చెట్లను వెతుక్కుంటూ-
ఈ పక్షులన్నీ
ఎక్కడికి వెళ్ళాయో?
** ** **
ఎప్పట్లాగే
గుప్పెడు గింజల్ని చల్లి,
వాటిమీద-
గిన్నెడు నీళ్ళను పోసాను.
నాకు తెలుసు
పిట్టల కోసం వెతుక్కుంటూ
ఈ చెట్టు
ఎక్కడికీ వెళ్ళదు.
-------------------------------------------
పి.రామకృష్ణ // భగవాన్ ఉవాచ
2. ఆ ఆదివారపు మధ్యాహ్నం
ఓ చిన్నారి
కోడిపిల్ల
అమ్మకోసం వెతుకుతూ, వెతుకుతూ..
దార్లో-
కారు టైరు క్రిందపడి,
చనిపోయింది.
1. అదే ఆదివారపు ఉదయం
తల్లికోడి-
కసాయి కత్తిక్రింద కంఠాన్ని వుంచి,
కళ్లు మూసుకుని, ఇలా ప్రార్థించింది.
"భగవంతుడా ఇలాంటి
చావు-
నా బిడ్డకు రాకుండా చూడు" అని.
----------------------------------------------------
Chaalaa baagunnaayi.
ReplyDeletenaaku nacchaayi.
Thank you Bhaskar gaaru.
ధన్యవాదాలు వనమాలి గారు,,.బాగా రాశారండి వీటిని రామకృష్ణ గారు.
Deletenijamenandi chalaa baagunnayi
ReplyDeleteచాలా నచ్చాయండి నాకు, అందుకే అందరితో షేర్ చేసుకున్నాను,. ధన్యవాదాలు వీణా గారు.
Deleteనేను కూడా చదివాను....నాకు చాలా నచ్చాయండి.
ReplyDeleteఅవును కదండి,.పద్మార్పిత గారు,అందుకే ఇలా...
Deleteచాలా గొప్పగా ఉన్నాయి రెండు కవితలూ...
ReplyDeleteచదవాల్సిన కవితలనిపించిందండి నాకు,...ధన్యవాదాలు చిన్ని ఆశ గారు..
Deleteభాస్కర్ గారు నమస్తే.
ReplyDeleteనాకు ఇదొక గొప్ప సత్కారం. నా రచనలను ఇలా ప్రస్తావించడం, సాటి కవిగా ఎలాంటి భేషజాలు, ఇగో ప్రాబ్లంలూ లాంటివి లేకుండా, నాకు మీ బ్లాగ్లో స్థానం కేటాయించడం, ఇవి మీ వ్యక్తిత్వానికి మంచి ఉదాహరణ.
కృతజ్ఞతలు సార్.
రామకృష్ణ గారు, నా బ్లాగ్ కి స్పాగతం అండి,.హ,హ,..నేను కవిని అనుకోవడం లేదండి ఇంకా,..నిజానికి మనసుకి నచ్చే కవితలు చాల తక్కువగా వుంటాయ్,.కారణాలు చెప్పలేం గాని,...నచ్చినప్పడు పది మందికి చెప్పాలనిపిస్తుంది,.అది మాములు విషయమే కదండి,....మీ రాక నిజంగా ఆనందదాయకం,.
Delete