Pages

8 November 2012

కవిత్వమూ,...ఓ సందేహమూ...


రాసేదంతా కవిత్యమేనా?
అని సందేహమెందుకు,....
కాకపోనూవచ్చు, భయమెందుకు మిత్రమా......
ఉబికి వచ్చే అక్షరాన్ని,
గొంతు నులిపి , అనుమానంతో,
అనవసరంగా, చంపడం ఎందుకు,
తరువాత తీరిగ్గా,
ఏడవడమూ ఎందుకు.,..

భావాలతో అక్షరాలకు,
లంకె కుదరక, కనెక్టివిటి కోసం,
గిలగిలలాడుతున్నావా,
అదే ఓ కవి జననమని గుర్తుంచుకో నేస్తమా...

బొడ్డుడని బిడ్డ బాధ,
ఏ ఎదిగినోడికీ అర్థమూ కాదు,
తలనెరిసినోడి తాత్వికత,
పురిటి కంపుని ఆపనూలేదు.
దేనికవే సమాంతరాలు,
అటునుంచి ఇటు దూకేదాక,.

కళ్లూ చెవులే కాదు,
ఇక్కడ పనిచేయాల్సింది,
నిన్ను నీవు తెరుచుకొని,
లోపలి అగాధాలలో అన్వేషించుకో,

నిర్భయంగా అక్షరమైపో,
అజరమరామై మిగలడానికి,
నిలకడగా రాసుకుపో,
నువ్వు నువ్వుగా నిలబడటానికి,
అది చాలు కవిత్వానికి,

ఇక వ్యాఖ్యలంటావా,,
పైకి లాగే వాడే పామై కరవావచ్చు,
క్రిందికి నెట్టెవాడే, నిచ్చనై మిగలావచ్చు.

కవిగా మిగుల్తావో,
కనుమరుగైపోతావో,
అది మరో పార్శ్వం,
కొద్ది మందికి మాత్రమే సాధ్యమయ్యే గొప్ప కళ,
కవిగా మిగలడమూ, వెలగడమూ....

12 comments:

  1. :) నచ్చింది అని అర్ధం...

    ReplyDelete
    Replies
    1. వెన్నల గారు, ధన్యవాదాలండి కవిత నచ్చినందుకు, సంకేత భాష నేర్చుకోవాలండి నేను కూడా..హ,.హహ

      Delete
  2. i hope and believe that u will never care abt any bull shit ever said by any one(including me ) in this so called comments section.way to go.i appreciate ur courage.

    ReplyDelete
    Replies
    1. హ,హ,..ధన్యవాదాలు తనోజ్,..కవిననే ఫీలింగ్ నాకేమి లేదండి, సరదాగా ఒక ఫ్లోలో రాయడమే,..దానికీ ధైర్యం కావాలంటారా...మీ లాంటి మిత్రుల వాఖ్యలు ఎప్పుడూ అవసరమేనండి, మరింతగా ప్రయత్నించడానికి..

      Delete
  3. అంతర్లీన భావం అత్యద్భుతం!!! అభినందనలండి.


    ReplyDelete
    Replies
    1. పద్మార్పిత గారు, ఎల్లప్పుడు ఆనందాన్నిచ్చే మీ అభినందనలకు ధన్యవాదాలండి.

      Delete
  4. కవిగానో కపిగానో మనిషిగా మిగలనీండి...
    బాగుంది మీ సందేహ నివృత్తి...

    ReplyDelete
    Replies
    1. వర్మ గారు, ధన్యవాదాలు,..రాయడం ముఖ్యంమేమో కదా,.కవిత్వమైనా,,కపిత్వమైనా, ఒక ఫీలింగ్ వెలువరచడమే మంచిదనిపిస్తుంది,కనీసం ఇలాగైనా..

      Delete
  5. వ్రాయనా వద్దా లేక భావాలని బయటికి రాకుండా నొక్కి పెట్టే వాళ్ళందరికీ ఈ భావం మంచి స్ఫూర్తినిస్తుంది భాస్కర్ గారూ..

    ReplyDelete
    Replies
    1. సుభ గారు, ధన్యవాదాలండి, ఒకరికి స్ఫూర్తినివ్వడం కంటే మనం చేయగలిగే గొప్ప పని ఏముంటుందండి, నిజంగా అలా జరిగితే ఆనందమేనండి.

      Delete
  6. ఆహా!
    కవిగా మిగుల్తావో
    కనుమరుగై పోతావో అనడంలో - ఓహో.. ఆ
    అంతర్లీన భావం అత్యద్భుతం!!! అభినందనలండి.

    ReplyDelete
    Replies
    1. అజ్ఞాత గారు, ధన్యవాదాలు,.మీ వాఖ్యలో జారిపోయిన అంతర్లీన భావం మహాద్భుతం,.

      Delete