Pages

7 November 2012

భూమీ ఆకాశం


రెండు పొగడ్తలు,
నాలుగు ఎదురుచూపులు,.
ఒక నవ్వు, అరాకొరా మాటలు,
అప్పుడప్పుడు ఓ చాక్లెటో,కప్పు ఐస్ క్రీమో..
అవుతాయా నా ప్రేమకు పూలు పరిచిన బాటలు...
నా ఆతృతా, నీ నిర్లక్ష్యం,..
భూమీ ఆకాశమేనా,..ఇంకేమన్నా వుందా సుమా.....

8 comments:

  1. ఎంత సింపుల్ గా చెప్పేసారండీ ప్రేమించే మనసులు ఎలా ఉంటాయో. ప్రేమలో ఎవరో ఒకరు ఇలా ఉండటం సహజం అనుకుంటాను ఆ ప్రేమ తెలిసే(పే) వరకు :)

    ReplyDelete
    Replies
    1. హ,హ,..అంతేనండి సుభగారు, ధన్యవాదాలండి,

      Delete
  2. బావుంది భాస్కర్!అదే ప్రేమికులంటే గంటలు,గంటలు గడిపెస్తారని అనుకొంటే పొరపాటే,నిర్లక్ష్యం అని అనుకొన్నా,ఆ ఎదురు చూపులలో,ఆ పొగడ్తలలో,ఆ నవ్వులలో నిన్నుచూసుకొనే మురిసిపోతుంది సుమ(మా)! ఆ మురిసిపోవడం కూడానీ మీద ప్రేమే సుమా()

    ReplyDelete
    Replies
    1. ఫల్గుణి గారు, చాలా రోజుల తరువాత మీ కామెంట్,మురిసిపోవడం నిజమేనా.. ఆత్మీయ పలకరింపుకి బోలెడు కృతజ్ఞతలండి.

      Delete
  3. సుమ గారిని భలే ప్రశ్నించారండీ..:-)
    బాగుందండీ భాస్కర్జీ...

    ReplyDelete
  4. వర్మగారు, మీకు వచ్చినందకు చాలా ఆనందంగా వుందండి,ధన్యవాదాలు

    ReplyDelete