Pages

25 January 2013

మనిషి మూలతత్వం.




1
దారిచూపే వాడొకడు, వెంటనడిచేవాడొకడు
రాసేవాడొకడు,చదివేవాడొకడు
వెంపర్లాడుతూ వెంటాడేవాడొకడు
ఇచ్చేవాడొకడు,అనుభవించేవాడొకడు
వెతికేవాడొకడు,నసుగుతూ బతికేవాడొకడు
అసంతృప్తే కదా,,,ఈ జీవిత చోదక రాగం
2
వేకువై వెలిగే వాడొకడు,చీకటై బతికేవాడొకడు
అతి తెలివితేటలతో తర్కించేవాడొకడు
చచ్చుపుచ్చు తలపులతో తల్లడిల్లేవాడొకడు
ప్రేమించేవాడొకడు, పొడిచి చంపేవాడొకడు
నిరంతర తుత్తరతో చిత్తకార్తె కుక్క ఒకడు
బలహీనతే కదా.,.ఈ బతుకు అసలు పాట
3
అడుక్కుతింటూ అలమటించేవాడొకడు
అన్నీ వున్నా, అర్రులుచాచే వాడొకడు
కొరుక్కుతింటున్న కోరికలతో
కుష్టురోగై మిగిలేవాడొకడు
ఏమి సాధించామంటూ
ఏడుస్తూ వెళ్లిపోయేవాడొకడు
దరిద్రమే కదా,., ఈ లోకపు దివ్యగీతం.
4
విర్రవీగువాడొకడు,భ్రమించువాడొకడు
సేవలో ఒకడు, కీర్తికై ఒకడు
తనను చూసి తాను మురియువాడొకడు
మూర్ఖత్వమే మేలను మేధావి ఒకడు
జ్ఞానినంటూ డప్పుకొట్టువాడొకడు
అమాయకత్వమే కదా,., ఈ మనిషి మూలతత్వం.

4 comments:

  1. అమాయకత్వమే కదా - ఈ మనిషి మూలతత్వం
    నిజమేనండి... నా భావన కూడా ఇదే.
    చాల చక్కగా చెప్పారు.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు భారతీ గారు,,,
      అమాయకత్వమే కదా - ఈ మనిషి మూలతత్వం,,
      ఈ వాక్యం నాకు కూడా నచ్చింది,...

      Delete
  2. బలహీనతే కదా.,.ఈ బతుకు అసలు పాట
    అమాయకత్వమే కదా - ఈ మనిషి మూలతత్వం
    నిజమేనండి... చాలా చక్కగా చెప్పారు

    ReplyDelete
  3. మంజు గారు ధన్యవాదాలండి, మీకు నచ్చడం ఆనందదాయకం,..

    ReplyDelete