ఇక్కడేదో
ప్రాబ్లెమ్ వుంది,
కనికనిపించకుండా
వున్నా,
తీవ్రమైనదేలావుంది.
డయాగ్నైస్
చేయడం వీలవుతుందా !
E.C.G
లు, X-ray లు గట్రా తీయించాలా !!
ఓ రెండు
మాత్రలతో నయమవుతుందా ?
పెద్దాపరేషన్
చేయించాలా ?
అప్పటికైన
బాగువుతుందా…….
ఏమో మనం
ఏం చేయగలం,
మంచిని
ఆశించడం తప్ప!
దేవుని
పై భారం వేయడం తప్ప!!
ప్రశ్నలతో
మనసు తిప్పుతుంది.
ఇలా
ఎందుకయ్యిందనో,
ఎలా
మొదలైందనో………..
అభావమైన
భావం,
మళ్ళీ
చిగురిస్తుందా ?
ఘనీభవించిన
స్పందన
మళ్లీ
ప్రవహిస్తుందా ?
good man.
ReplyDeleteతనోజ్ గారు, మీ అభినందనలకు ధన్యవాదాలు
ReplyDeleteఆశా భావం మనిషిని నడిపిస్తుంది, నిజమే కదా సర్.
ReplyDeleteకవితని మంచి మాటల మూటలతో నింపారు, చక్కని భావన...మెరాజ్
ఫాతిమా గారు, మీ అభినందనలకు ధన్యవాదాలు.
DeleteECG లేంటి, X Ray లేంటి..రెండు మాత్రలేమిటి? పెద్దాపరేషన్ ఏమిటి?
ReplyDeleteచాలా కాంప్లికేటెడ్ గా ఉందండోయి కవిత
కాంప్లికేషన్స్ ఏమీ లేవండి వెన్నల గారు, ఒక అభావ స్ధితినుంచి బయటపడే తపన,.....hi,hi.
Deleteఅంతా మంచే జరుగుతుందన్న ఆశే ముందుకు నడిపిస్తుందండి!
ReplyDeleteధన్యవాదాలు పద్మార్పిత గారు, చిన్నచిన్న ఆశలు, చిన్న చిన్న స్పందనలే కదండి, ఈ చిన్న జీవితం.
Deleteఅది ఎపుడు ఎలా ఎవరితో ఎందుకు మొదలౌతుందో తెలిస్తే...
ReplyDeleteఇంకా ముందు ఎందుకు మొదలవలేదా? అనిపిస్తుంది....:-)
లేకపోతె ఎందుకు మొదలైందా? అనిపిస్తుంది...:-)
నేను కవితని సరిగా అర్థం చేసుకున్నానో లేదో సందేహం...
మీ ప్రతిస్పందన లోనే తెలియాలి..తెలిసాక మళ్ళీ స్పందిస్తాను భాస్కర్ గారూ!
@శ్రీ
స్పందనలు లేని స్థితి, సాధారణమైన అనుభవమే కదా, శ్రీ గారు, అప్పుడప్పుడు.
Deleteఅది ఎందుకు మొదలవ్వుతుందో,.... ఎలా , ఎప్పటికి మామూలాగా అవుతుందో చెప్పలేం కదండి,
కవిత్వంలో కొంచం ఓవర్ గా చెప్పడంతో, కన్ఫ్యూసన్ క్రియేట్ అయ్యిందేమోనండి.
thank you, welcome.
భాస్కర్ గారూ!
Deleteనా స్పందనలో ప్రేమని ఉద్దేశించి వ్రాసాను...
మీరు చెప్పింది అర్థం అయ్యింది..
నేను దానిని ప్రేమకి అన్వయించాను...అంతే..:-)
భావం చక్కగా ఉంది మీ కవితలో...
@శ్రీ
ధన్యవాదాలు శ్రీ గారు,
Deleteఓహో భలే బాగున్నాయి మీ ఫీల్స్ చిన్ని చిన్ని కవితల్లో
ReplyDeleteయోహంత్, నా బ్లాగు కి సుస్వాగతం అండి,మీ అభినందనలకు ధన్వవాదాలు.
Delete