Pages

18 August 2012

నీ దేహపు స్పర్శా ప్రసాదం......



నీవు పలికిన
అర్థం లేని మాటలు కూడా,
వేణునాదమై, వీణావాదమై
ఈ బీడుకి తొలకరి జల్లై,
ఈ నాటికి, అలవోకగా అలాఅలా,
జీవాన్ని విత్తుతూనే వున్నాయ్,
నీ, నా జ్ఞాపకాలై........

ఇరుకిరుకు రోడ్లల్లో,
నీతో పాటు నడుస్తున్నప్పుడు,
నీ దేహపు స్పర్శా ప్రసాదం,
ఈ దాహార్తికి, అమృతమై,
నన్నింకా, వోత్తుకుంటున్నట్లే వుంది, సుమా!!

10 comments:

  1. మీరు వ్రాసే ఈ పదాలు ఆనందపు గుళికలు...

    ReplyDelete
    Replies
    1. పద్మార్పిత గారు, మీ హృదయపూర్వక అభినందనలకు దన్యవాదాలు .

      Delete
  2. వామ్మో!! ఈ సుమ గారెవరో నాకు తెలియాల్సిందే :):)

    ReplyDelete
    Replies
    1. రసజ్ఞ గారు, తెలుసుకోక తప్పదంటారా, చెప్తానండి,ఎప్పుడో ఒకప్పుడు ఆ విషాదగాధ,..........ధన్యవాదాలు.

      Delete
  3. జీవాన్ని విత్తుతూనే వున్నాయ్,
    నీ, నా జ్ఞాపకాలై.........
    nice feel...chaalaa baagundi bhaskar gaaroo!
    @sri

    ReplyDelete
  4. శ్రీ గారు, మీ అభినందనలకు ధన్యవాదాలు.

    ReplyDelete
  5. ఇరుకు రోడ్లవలన ఇంత ఉపయోగముందా...:-)
    బాగుంది భాస్కర్జీ మీ ప్రేమ స్పర్శ...

    ReplyDelete
    Replies
    1. వర్మ గారు, మీ అభినందనలకు ధన్యవాదాలు. నిజంగానే ఇరుకురోడ్లు, గొప్ప జ్ఞాపకాలే సర్,....హ,హ.......

      Delete
  6. lovely beautiful expressions as usual.good man good."వేణునాదమై, వీణావాదమై" do u really mean this?except this expression everything is perfect and very good

    ReplyDelete
  7. thank you thanooj, actually that line is not necessary, "వేణునాదమై, వీణావాదమై " just to give little force,

    ReplyDelete