కనిపిస్తున్నవి, వినిపిస్తున్నవి
రాస్తున్నవి, చదివిస్తున్నవి
ఆఖరికి స్పర్శిస్తున్నవి కూడా,
కృత్రిమ గుండె చప్పుళ్లే.
తెంపుకొచ్చామో,
తెగ్గొట్టుకొచ్చామో,
వెతుక్కొని మోసుకొచ్చామో
ఆర్తో, ఆర్ధ్రతో
స్పందనో, కన్నీరో
కోపమో, భయమో!!!
ఎక్కడక్కడివో , కూడగట్టి
పోగేయడమే.
వాటిలోంచి, అక్షరాలను
వెతుక్కొచ్చి, అతికించుకోవడమే!
నావి కాని పదాలతో,
నన్ను నేను తూట్లు పొడుచుకోవడమే,
సహజత్వం సుదూర స్వప్నమై,
జడత్వమే జీవన జాడ్యమై.....
ఇదంతా,
నన్ను నేను పారేసుకోవడమే,
నా నుంచి, నేను నిష్క్రమించడమే.
చాలా హృద్యంగా ఉందండీ ....కదిలించేసారు
ReplyDeleteసీత గారు, మీ అభినందనలకు ధన్యవాదాలు
Deleteమీ భావాలు బాగున్నాయి
ReplyDeleteకానీ...
అన్ని సార్లు వెతుక్కోము...అతుక్కోము భాస్కర్ గారూ!
కొన్నిసార్లు యథాతథంగా వ్రాస్తాము...
కొన్నిసార్లు మనభావాలకు అందమైన అక్షరాలలు సమకూర్చుకుంటాము..
ఏమంటారు?..:-)
@శ్రీ
హ,హ,...సరాదాకేనండి, రాయాలనిపించినపుడు ఏదో ఒకటి రాయడమే...
Deleteమీరు చెప్తే కాదనేదేముంది, శ్రీ గారు, ధన్యవాదాలు.
భాస్కర్ గారూ, వెతికి చూస్తె అక్షరాలన్నీ మనచుట్టూ ఉంటాయి. కానీ మీరు రాసిన కోణం బాగుంది.
ReplyDeleteబాగా రాసారు.
ఫాతిమా గారు, మీ అభినందనలకు ధన్యవాదాలు
Deleteబహు బాగుంది...ఇది మాత్రం కృత్రిమం కాదండోయ్:-)
ReplyDeleteపద్మార్పిత గారు, మీ సహజత్వాన్ని కాదనగలనా,దన్యవాదాలు, హి......
Deleteసహజత్వం సుదూర స్వప్నమై,
ReplyDeleteజడత్వమే జీవన జాడ్యమై.....
ఇక్కడే మనం నిలబడాల్సిన అవసరముంది భాస్కర్జీ..ఏటికి ఎదురీదే చేపపిల్లలా...నిష్క్రమించొద్దు...
వర్మ గారు, నిష్క్రమణ కాదు కానీ, ఏదో అనిశ్చితత్వం వెంటాడుతున్న ఫీలింగ్,.........మీకు ధన్యవాదాలు.
Delete