Pages

9 August 2012

కృత్రిమ గుండె చప్పుళ్లు



కనిపిస్తున్నవి, వినిపిస్తున్నవి
రాస్తున్నవి, చదివిస్తున్నవి
ఆఖరికి స్పర్శిస్తున్నవి కూడా,
కృత్రిమ గుండె చప్పుళ్లే.

తెంపుకొచ్చామో,
తెగ్గొట్టుకొచ్చామో,
వెతుక్కొని మోసుకొచ్చామో
ఆర్తో, ఆర్ధ్రతో
స్పందనో, కన్నీరో
కోపమో, భయమో!!!
ఎక్కడక్కడివో , కూడగట్టి
పోగేయడమే.
వాటిలోంచి, అక్షరాలను
వెతుక్కొచ్చి, అతికించుకోవడమే!
నావి కాని పదాలతో,
నన్ను నేను తూట్లు పొడుచుకోవడమే,
సహజత్వం సుదూర స్వప్నమై,
జడత్వమే జీవన జాడ్యమై.....
ఇదంతా,
నన్ను నేను పారేసుకోవడమే,
నా నుంచి, నేను నిష్క్రమించడమే.

10 comments:

  1. చాలా హృద్యంగా ఉందండీ ....కదిలించేసారు

    ReplyDelete
    Replies
    1. సీత గారు, మీ అభినందనలకు ధన్యవాదాలు

      Delete
  2. మీ భావాలు బాగున్నాయి
    కానీ...
    అన్ని సార్లు వెతుక్కోము...అతుక్కోము భాస్కర్ గారూ!
    కొన్నిసార్లు యథాతథంగా వ్రాస్తాము...
    కొన్నిసార్లు మనభావాలకు అందమైన అక్షరాలలు సమకూర్చుకుంటాము..
    ఏమంటారు?..:-)
    @శ్రీ

    ReplyDelete
    Replies
    1. హ,హ,...సరాదాకేనండి, రాయాలనిపించినపుడు ఏదో ఒకటి రాయడమే...
      మీరు చెప్తే కాదనేదేముంది, శ్రీ గారు, ధన్యవాదాలు.

      Delete
  3. భాస్కర్ గారూ, వెతికి చూస్తె అక్షరాలన్నీ మనచుట్టూ ఉంటాయి. కానీ మీరు రాసిన కోణం బాగుంది.
    బాగా రాసారు.

    ReplyDelete
    Replies
    1. ఫాతిమా గారు, మీ అభినందనలకు ధన్యవాదాలు

      Delete
  4. బహు బాగుంది...ఇది మాత్రం కృత్రిమం కాదండోయ్:-)

    ReplyDelete
    Replies
    1. పద్మార్పిత గారు, మీ సహజత్వాన్ని కాదనగలనా,దన్యవాదాలు, హి......

      Delete
  5. సహజత్వం సుదూర స్వప్నమై,
    జడత్వమే జీవన జాడ్యమై.....

    ఇక్కడే మనం నిలబడాల్సిన అవసరముంది భాస్కర్జీ..ఏటికి ఎదురీదే చేపపిల్లలా...నిష్క్రమించొద్దు...

    ReplyDelete
    Replies
    1. వర్మ గారు, నిష్క్రమణ కాదు కానీ, ఏదో అనిశ్చితత్వం వెంటాడుతున్న ఫీలింగ్,.........మీకు ధన్యవాదాలు.

      Delete