Pages

5 December 2013

పంకజం,


1
కారిన కన్నీటికి విలువ కట్టలేం కాని,
రాలుతున్న కవిత్వాన్ని గంపలకెత్తుకుందాం,.
ఎక్కడెక్కడి అవకాశాలు,
తన్నుకుపోవడానికి,
సిద్దంగా వున్నప్పుడు,
బురదల్లో నేం ఖర్మ,.
సమాధుల్లోనైనా నిద్రిద్దాం,..నష్టమేముంది.
స్పష్టమైన అస్పష్టం,
జీవితమైనా కావాలి,
లేదా కవిత్వమన్నా కావాలి,.

2
అదే బురదలో పొర్లి, పొర్లి
మునకలేసుకుంటూ,
రాసి,రాసి అలసిపోయి నిద్రిస్తున్నారేమో,.
కొత్త కవిత్వంకై కలలు కంటూ,.
గురి పెట్టబడిన, రాళ్లు ఎన్నిపడ్డా,.
నిద్రపోతున్నారా, మిత్రులారా,.
తెలివైన నిద్ర నటిస్తున్నారా,..

3
బుర్రలు పని చేయక పోవచ్చు,
కనీసం మోకాల్లో వున్న మెదడన్నా,
స్పందించాలి కదా,..
ప్రతిఘటించడం, పక్కన పడేయ్,
కనీసం, ఘర్ఘిరించడం చేతకానంత,
బలహీనంగా బురదల్లో ఇరుక్కున్నాక,
పందులు కూడా క్షమించలేవ్,..ఈ చేతకానితనాన్ని.

4
అయినా, అదంతా మనకెందుకు,
పదండి, కొత్త సూత్రాలతో కవిత్వం సాధన చేద్దాం,.
చివరిగా ఒక్క మాట,
వృద్ద సింహం ఒకటి,
వీడ్కోలుకి సిద్దమైంది,.కనీసం
ఒక్క చుక్క కన్నీరైనా కార్చండి,..
అదీ చేతకాదంటారా,..కవిత్వం రాసుకోండి,.



No comments:

Post a Comment