అహాలకో, ఇజాలకో
కొదువలేదిక్కడ.
పిగ్మాలియన్ ఎఫెక్ట్ !
మాటలతో ప్రతిదీ మార్చబడుతుంది.
ప్రోత్సాహమే కొత్త సృష్టికి నాంది .
ప్రోత్సాహమే కొత్త సృష్టికి నాంది .
నవలలు రాస్తూ,గిరాకి తగ్గి,
సినిమాల్లో కాలు పెట్టి,
చేతులు కాల్చుకున్న వారో,
మ్యాజిక్ లు, హిప్నటిజాలని,
మాయచేసినవారో,
మెట్లు కట్టేవారో,
మెలుకువలు నేర్పేవారో,
మాటలతో మనిషినే
మొత్తంగా మార్చేవారో,
యాంటీ టైటిల్స్ తో ఆకట్టుకునేవారో,
డిక్షనరీలలో పదాలు వెతుక్కుని,
అన్నిటిని విస్తరించేవారో,
ఎవరి గొప్పలు వారే చెప్పుకుంటూ,
మురిసేవారో,
ఎక్కడెక్కడివో కాఫీలు కొట్టి,
ఏ ఎండకా గొడుగు పట్టి,
అదే వ్యక్తిత్వమని పాఠాలు చెప్పేవారో ,
అలాంటి వారందరూ,
తెలుగువారికి వ్యక్తిత్వాన్ని,
గుట్టలు , గుట్టలు గా
గుట్టలు ,
పుస్తకాలల్లో ప్యాక్ చేసి,
పేజిల లెక్కన, కిలోల లెక్కన
అందంగా అమ్ముతున్నారిక్కడ ,
పదండి కొనుక్కుందాం.
మెదడు వ్యాపారులే ఇప్పుడిక్కడ,
వ్యక్తిత్వ వికాసకులు.
స్వలాభం లేకుండా,
ఎవడికి ఎవరిని ,
బాగుచేసే పరోమోద్దేశ్యం,
ఎప్పటికి ఉండదిక్కడ .
ఎవడికి వాడు బాగుపడాలని తప్ప!!
మన చుట్టు ఉన్న సమాజాన్ని,
చదవలేని మనం,
ఎన్ని పుస్తకాలు చదివి ఏం లాభం?
పుస్తకాలు చదివి,
వ్యక్తిత్వాన్ని నిర్మించుకొనే,
మన లాంటి వాళ్లున్నంత కాలం,
ఇంకో రంగంలో కాలు మోపరులే వాళ్లు .
పువ్వులు గా ఎలా వికసించాలో,
మొగ్గలకూ శిక్షణ నిస్తారు,
మన వ్యక్తిత్వ వికాసకులు.,
గంటకింతని డబ్బులు తీసుకొని.
వ్యక్తిత్వం నిర్మల ఆకాశమేమి కాదు,
ముసుగు మబ్బుల క్షేత్రమది.
పుస్తకాలతో మేఘాల రూపు
మార్చేద్దాం, పదండి.
అన్నీ కలిసొస్తే,రాజ్యాలనేలేది,
వ్యక్తిత్వం లేని మనుషులే కదా,ఇప్పుడు.
మనకెందుకండి, వ్యక్తిత్వం,.
ఎవరా వర్తకులు? ఏమా కథ? ఎవరి గురించండి? (మీ expression చాలా బావుంది)
ReplyDeleteeviri gurinchi anekante,aa pusthala gurinche nandi naa feeling idi,
Deletethank you ravi garu, welcom to my blog.
చాలా బాగుంది భస్కర్ గారు..:)
ReplyDeleteఅర్ధాన్ని చక్క గా పండించారు.
thank you sitha garu, naakaithe continuity ekkado miss aina feeling,
DeleteVisit http://bookforyou1nly.blogspot.in/
ReplyDeletefor books
thank you mee kosam garu, welcom to my blog, book kavalante call chesthanandi.
Deleteమన చుట్టు ఉన్న సమాజాన్ని చదవలేని మనం ఎన్ని పుస్తకాలు చదివి ఏం లాభం?
ReplyDeleteనిజమే అండీ.. చాలా బాగా చెప్పారు..
thank you sai garu meeku nachinanduku,
Deleteమీ శైలికి భిన్నం గా ఉందే!
ReplyDeletenaalugu nelala nundi pending kavitha andi idi, ippataki edo miss indi ane feeling undi, konni rough papers dorakaledu, koncham binnam gane undachu, intha kante better cheyaleka poyaanu, thank you vennela garu.
Deleteఅందరికీ తెలిసిందే. యండమూరి, బీవీ పట్టాభిరాం.
ReplyDeleteNice post.
ReplyDeletethank you krishna garu, books lo cheep techniques chusi bhadha vesthundi, personality patla nijamaina prema kanipinchadu, edo maya cheddamane thappa.
Deletewelcom to my blog sir.
Bhaskar garu,
ReplyDeleteపువ్వులు గా ఎలా వికసించాలో,
మొగ్గలకూ శిక్షణ నిస్తారు...
is a powerful satire. I liked it. There is no character building... there is only character presentation. It is all seeming... no being.
with best regards
thank you very much sir,
Deleteit is all seeming ... no being.
100% correct sir.
you are most welcome.
"వ్యక్తిత్వం నిర్మల ఆకాశమేమి కాదు,
ReplyDeleteముసుగు మబ్బుల క్షేత్రమది."
చాలా బాగుందండీ..
thank you and welcom to my blog raaji garu.
Deletefuckingly awesome man . superb man superb man.
ReplyDeletethank you thanooj garu,
ReplyDelete