మనసు వాకిట్లో నిలబడి,
ప్రేమగా పిలుస్తుందది.
నా కోసమే, కేవలం నా కోసమే
మధురమైన గీతాలను,
మృదువుగా ఆలాపిస్తూ,
రా రమ్మని ఆహ్వానిస్తుందది.
శరీరంలోని అణవణువును,
చూపులతోనే నిమురుతూ,
తలుపులు కొంచం దోరగా తెరవమంటు,
ప్రాధేయపడుతుందది.
నీ ఆనందం కోసమే,
హృదయోల్లాసం కోసమే కదా నేనని,
జ్ఞానాన్ని చుట్టుముట్టి,
ఉక్కిరి బిక్కిరి చేస్తు,
దీనంగా వేడుకుంటుందది.
నా కర్ధమవుతూనే వుంది,
ఇక సమయం మరింతగా లేదని,
వశం తప్పడానికో,
లోబడడానికో,
ఈ ఊబిలో దిగబడడానికో......
అనుకోవడానికి ఇంకేముంటుంది,
ఆ ఒక్కటి వదలి వెళ్లాక.
idea taken from coffe of jalatharu vennela.
ReplyDeletethank you andi.
చాలా బాగా రాసారు భాస్కర్ గారు..
ReplyDeletethank you sitha garu, most welcom.
Delete:-)
ReplyDelete@sri
thank you sree garu, aa sign artham emito artham kaledandi.
Deleteభాస్కర్ గారు , కాఫీ అన్నారా? :))
ReplyDeleteబాగుందండి..కవితలెన్నో బహు చక్కగా అల్లేస్తున్నారే?
thank you vennala garu,
Deleteedo mee dayatho alaa rayadame,
బాగుందండీ
ReplyDeletethank you chinni garu, welcom to my blog.
ReplyDelete