సారాన్ని
కోల్పోయాక, నేలతల్లి
విలువైన ఏ
విత్తును మొలకలెత్తించలేదు,.
చవిటిపర్రై,.పిచ్చిమొక్కలకు
ఆలంబనగా నిల్చి,.
ఆనందవడటం
తప్ప,.
అండాల్లేకుండా
గర్భాశయాలు,.
పిండాలకు
రూపమిచ్చి,.
ఏ బిడ్డలకు
జన్మనివ్వలేవు,.
ప్రమాదకరమైన
కణుతలకు,
పొదరిల్లుగా
మారడం తప్ప,..
ఆస్వాదించే
హృదయాన్ని,.
స్పందించే
మనసుని పోగొట్టుకున్నాక,.
ఎంత గొప్ప
కవిక్షేత్రమైన,.
కదిలించే ఏ
కావ్యానికి వెలగునివ్వలేదు,.
అర్థం పర్థం
లేని అకవిత్వ రాశులకు తప్ప,
దొంతర్లుగా
పుస్తకాలు పేర్చుకోవడం తప్ప,.
బాగుంది
ReplyDeleteతెలుగమ్మాయి గారు, ధన్యవాదాలండి,.
Delete