1
ఎదురుచూస్తునే
వుంటాం మనం,
కళ్లువిప్పార్చుకొని, ఇంకొన్ని
ఆశలు కూర్చుకొని,
ఆ చివరాఖరి
చూపులు
మళ్లీ
తెరుచుకోకుండా, మూసుకొనేదాకా.
2
ఎన్ని
కష్టాలు, తలలకెత్తుకొని తిరుగాడిన దుఃఖాలనుంచి
విముక్తినొందే
సమయాలను మళ్లీమళ్లీ తలుచుకుంటూ
వదిలిపోయిన
చిరునవ్వుల చివరిస్పర్శల పలకరింతలను
పదిలంగా
దాచుకొని, దాచుకొని
పగలకుండా, ఓదార్చుకుంటున్న
ఓ పురా
హృదయాన్ని, కొత్తగా పునర్మించుకోలేక
వదలని
వేదనను, హత్తుకొని సముదాయించుకొంటూ
3
ఎన్నెన్ని
ఆలోచనలు సమసిపోయాయో
ఏ ఏ
అనుభూతులు వదలిపోయాయో
ఎన్ని
జీవితకాంతులు,అలా చూస్తుండగానే ఆరిపోయాయో
లెక్కలకందని,లెక్కించలెన్నన్ని
తారకల్లా తెల్లారిపోయాయో
ఒక
హృదయసాక్ష్యానికి, తార్కాణంగా మిగలడానికి కాకపోతే
ఎందుకిలా,
ఇక్కడే చూస్తుండిపోతాం.
దేన్నీవదలకుండా,
ఎటూ కదలకుండా.
4
మొదలుకావడంలో
మన ప్రమేయమే లేనట్లు
పయనమంతా
మనమే చేసినట్లు, భరించినట్లు
ఇహలోకబంధాలు
వదిలించుకొని,
ఇకరా అని,
ఎవరో పిలిచినట్లు,
ఒక్కొక్క
అంశాన్ని ఎంత జాగ్రత్తగా,
పునఃసమీక్షించుకుంటుంటామో
కదా, మనం.
మనకు మనమే
ఒక వైభోగవంతమైన వలయాన్ని,
కందకంలా
నిలుపుకొని, కనులముందు
ఎంతగా
విలపిస్తామో మరి,. దాన్నిదాటలేక.
చక్కటి భావవల్లరి, మీ శైలి చాలా బాగుంటుంది.
ReplyDeleteMeraj Fathima గారు, మీ ఆదరపూర్వక ప్రోత్సాహం , మరన్నికవితలకు ప్రేరణ నిస్తుంది,., ధన్యవాదాలండి,.
Deleteచాలా బాగుంది
ReplyDeleteహిమబిందు గారు,. ధన్యవాదాలండి,.
Delete