ఒకసారి
మనం తలెత్తి ఆకాశం వంక చూస్తే,. ఓ రాత్రివేళ,.అత్యంత పురాతనమైన
విజ్ఞానశాస్త్రానికి మనం దారులు తెరిచినవారమవుతాం,.
నులకం
మంచం మీద పడుకొని, రాత్రి ఆకాశంలో నక్షత్రాలు లెక్కించుకుంటూ,. ఖగోళ కథలను
చెప్పుకుంటూ నిద్రపోవడం,. ఒక పాత కాలపు జ్ఞాపకం గా గుర్తువస్తున్నప్పుడు, ఎలా
కోల్పోతున్నామో, రాత్రిపూట ఆకాశాన్ని అని అర్థమవుతుంది.
చందమామ
తప్ప మనం గుర్తించగలిగిన ఆకాశ కాంతులేవి లేకుండా చేసుకుంటూ వస్తున్నాం. ఇలాంటి పరిస్థితులలో ఆకాశదర్శనానికి కొంత
ఆసక్తిని అద్దడానికి దాదాపు ఒక కాంతి సంవత్సరం దూరం నుంచి వస్తున్న తోకచుక్క
ఐసాన్. దీన్ని గురించ కొంచెం తెలుసుకొనే ముందు కొన్ని ఖగోళవిషయాలను గురించి
తెలుసుకుందాం.
మనవిశ్వం
ప్రస్తుతం
మనకు తెలిసి ఒకే విశ్వాన్ని విశ్వసిస్తున్నాం,. ఒకానొక అనంతమైనశక్తి ద్రవ్యరాశి గా
మారే పరిణామంలో బిగ్ బాంగ్ సిద్దాంతం ప్రకారం దాదాపు 13.8 బిలియన్ సంవత్సరాల
క్రితం ఈ విశ్వ ఏర్పడినట్లు చెప్తున్నారు. క్షణక్షణం విస్తరిస్తున్న ఈ విశ్వం
అంతకంతకు పెరుగుతూపోతూవుంది,. ఒక ప్రత్యేక అవధి దగ్గర ఈ వ్యాకోచం ఆగిపోయి తిరిగి
సంకోచించడం మొదలవుతుందనేది, ఒక ఊహ. విశ్వం ఎంత పెద్దదో ఊహకందదు కానీ దీనిలో రెండువందల
బిలియన్ల గెలాక్సీలలో(1011) దాదాపు 3*1023నక్షత్రాలు
వున్నట్లు ఒక అంచనా.దీని వ్యాసార్థము దాదాపు 46బిలియన్ల కాంతి సంవత్సరాలని ఒక అంచనా.(కాంతి
సంవత్సరము అంటే కాంతి ఒక సంవత్సర కాలంలో ప్రయాణించే దూరము 9.5*1012కిలోమీటర్లు)
మన
గెలాక్సీ (మిల్కీవే / పాలపుంత)
దాదాపు
లక్షకాంతి సంవత్సరాల పొడవు, 3వేల కాంతి సంవత్సరాల వెడల్పుతో మన సూర్యుడులాంటి
నక్షత్రాలను షుమారు 100 నుంచి 400 బిలియన్లలను కలిగివుంటుంది మన గెలాక్సీ వయస్సు
షుమారు 12.6 బిలియన్ సంవత్సరాలు,.మన సూర్యుడు ఈ గెలాక్సీ కేంద్రానికి దాదాపు,
27వేల కాంతి సంవత్సరాల దూరంలో వుండి,. కేంద్రం చుట్టు ఒక సెకనుకు 220 కిలోమీటర్ల
వేగంతో ప్రయాణం చేస్తున్నాడు. సర్పిలాకారంలో వుండే మన పాలపుంతకు దగ్గరగా వుండే మరో
గెలక్సీ సోదరుడు ఆండ్రోమెడా దాదాపు 2.5 మిలియన్ల కాంతి సంవత్సరాల దూరంలో వుంది.
మన
సూర్యకుటుంబం
పుస్తకాలలో మనం
చదువుకుంటున్నట్లు సూర్యుడు అనే నక్షత్రం దాని చుట్టు తిరిగే ఎనిమిది గ్రహాలు,
ఉపగ్రహాలు, గ్రహశకలాలు, తోకచుక్కలు ఇవన్ని కలిపితే మన సూర్యకుటుంబం. మన గెలాక్సీలో
మధ్య రకానికి చెందన ఒక మధ్యవయస్సు తార సూర్యుడు. మన సూర్యకుటుంబం దాదాపు 4.6
బిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడింది. దీన్ని కొలవడానికి ఆస్ట్రనామికల్ యూనిట్స్
సరిపోతాయి. ఒక ఆస్ట్రనామికల్ యూనిట్ అంటే భూమికి సూర్యుడికి మధ్యదూరం (15కోట్ల
కిలోమీటర్లు,. కాంతి సంవత్సరాలలో చెప్పాలంటే 500 కాంతి సెకనులు) సూర్యుడికి మన
సూర్యకుటుంబంలో చివరి గ్రహం నెఫ్య్టూన్కి మధ్యదూరం 4.3 బిలియన్ కిలోమీటర్లు అంటే 4
కాంతి గంటలు. ( గంటలో కాంతి ప్రయాణించే దూరం దాదాపు 100కోట్ల కిలోమీటర్లు) లేదా 30 AU.
సూర్యకుటుంబంలో
లెక్కకుమిక్కిలిగా చిన్నాపెద్ద రాళ్లు,మంచుగడ్డలు,మరుగుజ్జుగ్రహాలు తిరిగే
ప్రాంతాలు మూడు వున్నాయి.
1. ఆస్టరాయిడ్ బెల్ట్ ప్రాంతం
2. క్యూపియర్ బెల్ట్ ప్రాంతము
3. ఊర్ట్ క్లౌడ్ ప్రాంతము.
(ఇంకా వుంది)
No comments:
Post a Comment