నవంబర్ 21న ఐసాన్ ఫోటో
ఈరోజు (నవంబర్ 28) రాత్రి 11.45కి సూర్యునితో ముఖాముఖి సమావేశం కానున్న ఐసాన్ తోకచుక్క,. తన సుధీర్ఘయాత్రను క్షేమంగా పూర్తి చేయాలని కోరుకుంటూ,.
సెప్టంబర్24,2012 న ఇంటర్నేషనల్ సైంటిఫిక్
ఆప్టికల్ నెట్ వర్క్(ISON) దాదాపు గురుగ్రహం ఆవల వుండగానే కనుగొనబడిన ఐసాన్ తోకచుక్క ఈ రోజు (నవంబర్ 28) సూర్యునికి
అత్యంత సమీపంలోకి రాబోతుంది. బహుశా తొలిసారి సూర్యసందర్శనకు వచ్చి బుధగ్రహం
కక్ష్యను దాటి సూర్యునికి కేవలం 11లక్షలకిలోమీటర్ల దూరం నుంచి ప్రయాణించబోతున్న ఈ ఐదు
కిలోమీటర్ల వ్యాసం కలిగిన ఈ చిన్న తోకచుక్క 2,700 0 C సూర్యుని వేడిని,సౌరగాలులను,బలమైన ఆకర్షణను
తప్పించుకుని బతికిబట్టకట్టగలుగుతుందా, అనే సందేహాలకు ఈ రోజు సమాధానం వచ్చే అవకాశం
వుంది., సూర్యుడినుంచి తప్పించుకోవడానికి తన వేగాన్ని గంటకు నలభైవేలమైళ్ల
నుంచి పెంచుకుంటూ ఈ రోజు తన అత్యధికవేగం
ఎనిమిది లక్షల ముప్పైమైళ్ల వేగానికి ఈ రోజు పెంచబోతుంది. ఈ ప్రయత్నం సఫలమైతే అది
తన యాత్రను సజావుగా సాగించగలుగుతుంది లేకపోతే ఊర్ట్ మేఘ ప్రాంతంలో మొదలై సూర్యైక్యంతో ఐసాన్ కథ ముగిసిపోతుంది.
క్రింది పరిణామాలు సంభవిచే అవకాశం వుంది.
పూర్తిగా సూర్యుడిని గుద్దుకొని, దానిలో
కలిసిపోవచ్చు.
చిన్నచిన్న ముక్కలుగా విడిపోయి, అనేక తోకచుక్కలుగా మారి బయటపడవచ్చు.
తనచుట్టు వున్న మంచు పదార్దాలు పూర్తిగా
ఆవిరైపోవడం వలన తోకను కోల్పోయి కేవలం చిన్నశకలంగా మిగిలిపోవచ్చు.
తన కక్ష్యను మార్చుకోవచ్చు.
అన్ని తట్టుకొని తనలాగా తిరిగిరాగలిగితే అత్యంత
సుందరమైన,ప్రకాశవంతమైన తోకచుక్కగా మనకు
దర్శనమివ్వవచ్చు.
ఐసాన్ విజయం సాధించాలని కోరుకుందాం.
BEST OF LUCK ISON
ఆసక్తికరంగా ఉంది ఈ గ్రహ సంగతి.
ReplyDeleteధన్యవాదాలు మాలతి గారు,..
ReplyDelete