1
ప్రపంచంలో నీకేం కనిపిస్తుందో,.
అడ్డదిడ్డమైన నసుగుళ్లతో,.
అడ్డంపడే ప్రశ్నలతో,.
ఇలా అడిగేవారెవరికి,.అందనంత దూరంలో.
2
ఒక ద్వేషంలో ఏముంటుందో,
ఒక స్వార్థంలో ఏముంటుందో,
ఒక కష్టంలో ఏముంటుందో,
ఒక దుఃఖంలో ఏముంటుందో,
నువ్వెప్పటికి అనుభవించలేవ్,అది నీది
కానప్పుడు,.
ఎవరికి బదలాయించనూ లేవ్,అది నీదైనప్పుడు.
3
అసలు ప్రేమంటే ఏంటని,
జ్ఞానానికి అర్థముందా అని,
లోకాన్ని వెతికే వెర్రా అని,.
ఇదంతా పిచ్చాఅని,.
అప్పుడప్పుడు మెదలే ప్రశ్నలు,.
హేయ్,.హేహేయ్,.
తెలిసిందేంది,.తెలియనిదేంది,.
కవిత్వం కొమ్ములతో కుమ్ముతున్నప్పుడు,
ఇక్కడ ప్రపంచాలండవ్,.
కనబడని వింతలోకాలక్రింద దాక్కొన్న,
కొంత చెత్త నీకప్పుడు,.
గురువవుతుంది,.
కాని,కాకపోని,. మనకి మనమే అలా,.
జబ్బలు చరుచుకో, కాస్తా హుషారుగా
వున్నప్పుడు.
నోరెండినప్పుడు, తలతీసి
తాకట్టుపెట్టుకో.
ఏదీ చేతకానప్పుడు మోకరిల్లు,
పోయేదేంలేదులే.
గెలుపు,ఓటిమి,.స్వపక్షం,విపక్షం,
అస్మదీయుడు,తస్మదీయుడు,.
ఎవరులేరు,.ఏదీ లేదు జీవితానికి,.
ఇదొక జీవితం అంతే,.
విశేషాణాలు,అలంకారాలు,. ఎక్సెట్రా
ఎక్సెట్రా,
నీ కల్పితాలు,. నీకు మాత్రమే అవి,.
జీవితానివి కావు,. అని కూడా
అర్థంకాని,.
No comments:
Post a Comment