Pages

7 November 2013

డిక్లరేషన్ ఆప్ ఎ పొయట్



ఒక అజ్ఞానపు వచనం
ఇలా మొదలవుతుంది బహుశా

1
నేనెల పిలవబడుతున్నాననేది,
ఎప్పటికి, నాకు కిరీటమై మిగలబోతుందనేంత,
స్పృహ లేని పరిస్థితులలోకి,.
ఎలా నెట్టబడుతుంటుంటామో.

2
అక్షరాలకు విలువవుండాలనేదే,.
నా అభిమతం కూడా,.
నీలో ఆలోచనలను రేకెత్తింప చేయాలనేదే,.
 వీటి లక్ష్యం కూడా, వీటిధ్యేయం కూడా,.
3
ఏ హితాలను ఆశించి,.
మొదలవుతుందో కాని,. ఓ అక్షరం
ఏ సమాజాల శుద్ధి కోసం,
బయలుదేరుతుందో కాని,.. ఓ వాక్యం
కానీ,.అవి కూడా కలలు కంటాయేమో,.
ఒకానొక మసిబారని మస్తిష్కం నుంచో,.
విషంపూసుకోని జ్ఞానపు కోరలనుంచో,.
తమ ఉద్భవానానికి,.నాంది జనించాలని.
4
అక్షరం నిజానికో వికృతక్రీడ కాదు,.
లోపలి అస్పష్ట అశుద్దాలను వెదజల్లడానికో,.వేదికా కాదు,.
వ్యక్తి స్వేచ్ఛముసుగుల్లో,.
పరాయి మెదళ్లను బంధించే శృంఖలమూ కాదు,.
5
నీకో వాదముంది, అంగీకరించవచ్చు,.
అదే సత్వమంటే మాత్రం విభేదించాలనేంత,
తెలివిని కూడా కోల్పోయేటంత అభిమానాన్ని,
మూటలుకడుతున్న వాక్యాలు,
ఎంతగా మండిపోతుంటాయో,.
నీ లొంగుబాటును చూసి,.
6
ఎగరాల్సిన ఎత్తులు,. చేరుకోవాల్సిన చోట్లు,
నా లోపలి ప్రత్యేక ఆలోచనల వికృత సమూహాలు,
బలహీనతలపై చూపుపెట్టి,,.గురిచూసి వలవేసిన లోతులు,
తడి ముసుగులో నికృష్టపు వాంతులు,
వేడివేడి అయోమయపు నూనెను,.
బొబ్బలెక్కలా పోసి,.ఓదార్చే మాయలు,
నిను దారితప్పించే దరిద్రాలు,..
నిను నిద్రపుచ్చే మాటలు,,.
పాక్షిక దృష్టుల దుష్టుల పక్షపాతపు రాతలు,.

 సెలవు,సెలవిక సెలయేరా,.. నువ్విక పారబోక.
8
సమాజహితాన్ని కాంక్షించేదే సాహిత్యమైతే,
కవిత్వమూ అందులో ఓ భాగమైతే,
ఇక్కడే కాదు,, ఎక్కడా అలా భావించేంత,
హితాక్షరాలు  కనబడనప్పుడు,.
చాతకానప్పుడు అలా రాయడం,
ఏ మాత్రం సిగ్గుపడకుండా చెప్పుకుంటాను,.
 నేను కవిని కాదని,.ఎప్పటికి కాలేనని.


No comments:

Post a Comment