ఏ రాజ్యాలు సాధిస్తావ్,.
ఏడుపు గొట్టు ముఖాన్ని,.
మోసుకుంటూ అలా,.
2
ఎన్ని చిరునవ్వుల్ని,
వెలిగించాలో కదా,.
అన్నిన్ని అశ్రుమలినాల్ని,
శుభ్రంగా కడగాలంటే,.
3
ఏ దూరము దగ్గర కాలేదు,.
ఏ బంధము,.అతకలేదు,.
ఏ ఆర్తి హత్తుకోలేదు,.
అంత అవివేకాన్ని.
4
మేఘం కురిసినట్లు,
పువ్వు విరిసినట్టు,
నెలవంకవై,.నవ్వుని
ఆశ్రయించు.
No comments:
Post a Comment