Pages

30 October 2013

జ్ఞాపకం


1
 ఆ ఒక్క పదం వుంది చూసావు,.
నిన్నెల ఆకట్టుకుంటుందో,.
నిన్నెల నిలబెడుతుందో,.
నిన్నెల చంపేస్తుందో,.
ఆ ఒక్క బక్క పదమే,.
బహుశా నువ్వెప్పుడు,.
దాన్ని గురించి ఆలోచించికూడా వుండవు..,
ఆలోచించినా,.నవ్వుకొనెవుంటావు,.
2
మాటల పట్ల ప్రత్యేక ప్రేమేం లేదు,.
కాని,.కొన్ని సార్లు ఎవరైన వుంటే,.
మాట్లాడాలనిపిస్తుంది,.
చాలా సార్లు,. తొందరగా తప్పించుకోవాలనిపిస్తుంది,.

మౌనంగా మిగలడంలోని సుఖాన్ని తలుచుకోవడం,.
మాటలేలేని జీవితం ఎలా వుంటుందో,.

నిజంగా,.చాలా కష్టమైన పని మాట్లాడం,.
3
ఒక్క భావము లేక,. ఒక్క స్పందన లేక,.
హృదయ శ్మశానన మొలిచే మాటలనో,.
అనాథలైన పదాలనో కూడగట్టుకుని,.
సంద్రంలాంటి,.జీవితాన్ని దాటల్సోచ్చినప్పుడు,.
ఖచ్చితంగా మునిగిచావాలనిపిస్తుంది,.

అంటిపెట్టుకున్న నీ నవ్వుకొటి,
పట్టుకున్నట్లున్నాను,. 

కొట్టుకెళ్లిపోతున్నాను,,.ఈ కనిపించని అలలమధ్య

2 comments:

  1. మాటల పట్ల ప్రత్యేక ప్రేమేం లేదు,.
    కాని,.కొన్ని సార్లు ఎవరైన వుంటే,.
    మాట్లాడాలనిపిస్తుంది,.
    చాలా సార్లు,. తొందరగా తప్పించుకోవాలనిపిస్తుంది,....ఇది చాలా నచ్చేసింది

    ReplyDelete
  2. Padmarpita,. మీ ఆదర పూర్వక వ్యాఖ్యలకు ధన్యవాదాలు,..

    ReplyDelete