( నజరానా పేరు క్రింద సుధాకర్ గారు అనువదించిన కొన్ని ఉర్ధూ కవితలు,. వారి బ్లాగ్ నుంచి సేకరించినవి)
*పనిగట్టుకొని ఆమె చిత్రపటాన్ని
పది మందికీ చూపించాను
ప్రతి ఒక్కడితో ఇప్పుడు
పగను కొని తెచ్చుకున్నాను
-ఆజాద్
*నీకు చాలా దూరంలో ఉన్నాను
నీ మీదే మనసు పెట్టుకున్నాను
నీ చిరునామా దొరికినా దొరక్కపోయినా
నీ కోసం మాత్రం నీరీక్షిస్తూనే ఉంటాను
-వహషత్ కలకత్తవీ
*మనసుతో చెప్పే వాణ్ని
అలాంటి బాటలో నడవద్దని
ఎదురు దెబ్బలుతిని పడింది
అనుకున్నాను తగిన శాస్తి జరిగిందని
పది మందికీ చూపించాను
ప్రతి ఒక్కడితో ఇప్పుడు
పగను కొని తెచ్చుకున్నాను
-ఆజాద్
*నీకు చాలా దూరంలో ఉన్నాను
నీ మీదే మనసు పెట్టుకున్నాను
నీ చిరునామా దొరికినా దొరక్కపోయినా
నీ కోసం మాత్రం నీరీక్షిస్తూనే ఉంటాను
-వహషత్ కలకత్తవీ
*మనసుతో చెప్పే వాణ్ని
అలాంటి బాటలో నడవద్దని
ఎదురు దెబ్బలుతిని పడింది
అనుకున్నాను తగిన శాస్తి జరిగిందని
-అష్రఫ్ రాహాబ్
*ఇవాళ హృదయాన్ని
దివాళా తీసి కూర్చున్నాను
కొంత సంతోషమూ దొరికింది
కొంత దు:ఖమూ మిగిలింది
-జిగర్
దివాళా తీసి కూర్చున్నాను
కొంత సంతోషమూ దొరికింది
కొంత దు:ఖమూ మిగిలింది
-జిగర్
*అందరూ నాకే చెబుతారు
బుద్ధిగా తలొంచుకుని నడవాలని
ఆమెకెందుకు చెప్పరు మరి ?
ముస్తాబై మా బస్తీలోకి రావద్దని
- అక్బర్ ఇలాహాబాదీ
*కలుసుకుందాం అనే మాట
అలవోకగా అనేసింది
ఎక్కడ? అని అనేసరికి
'కలలో' అంటూ కదిలిపోయింది
-అమీర్ మీనాయీ
*సిగ్గులొలుకుతూ
నా సన్నిధిలో తాను
ఆమె దగ్గరున్నంత సేపూ
నేను నేనులో లేను
- జిగర్
*నా పేరు ఆమె కళ్ళల్లో
భద్రంగా రాసి వుంది
బహుశా ఏ కన్నీరో
దాన్ని చెరిపేసి ఉంటుంది
-బషీర్ బద్ర్
*కాశ్మీరు పూలమీద
మంచు బిందువులు నర్తిస్తున్నాయి
మరి ఎక్కడ నుండి
ఈ రక్తపు చినుకులు వర్షిస్తున్నాయి?
-రఫిక్ గిరిధర్ పురీ
*నువ్వే రానప్పుడు
నీ ఊహలతో పనేంటనీ
దయతో వాటికి చెప్పవూ
వచ్చే శ్రమ తీసుకో వద్దనీ.
-జిగర్ మురాదా బాదీ
*ఉదయ సంధ్య వేళ
మధువు పుచ్చుకుంటున్నాను
మతాధిపతీ! నన్నాపొద్దు
ఉపాసన కోసం ఆత్మను సిద్ధం చేస్తున్నాను.
-ఆదమ్
*ఆ భోగినీ విలాసం చూడండి
హృదయ తాపం రగిలించి
చూపులు కలపకుండానే చెక్కేసింది
ముసి ముసి నవ్వులు కురిపించి .....
-జిగర్ మురాదాబాదీ
నీ ఊహలతో పనేంటనీ
దయతో వాటికి చెప్పవూ
వచ్చే శ్రమ తీసుకో వద్దనీ.
-జిగర్ మురాదా బాదీ
*ఉదయ సంధ్య వేళ
మధువు పుచ్చుకుంటున్నాను
మతాధిపతీ! నన్నాపొద్దు
ఉపాసన కోసం ఆత్మను సిద్ధం చేస్తున్నాను.
-ఆదమ్
*ఆ భోగినీ విలాసం చూడండి
హృదయ తాపం రగిలించి
చూపులు కలపకుండానే చెక్కేసింది
ముసి ముసి నవ్వులు కురిపించి .....
-జిగర్ మురాదాబాదీ
*బతుకంతా నీ కోసం
పరితపిస్తూ జీవించా
ఎదురు చూపులు చూస్తూ
ఎందరినో ప్రేమించా
-హఫీజ్ హొషియార్ పురీ
*ఆకులకీ గడ్డి పరకలకీ
అవగతమే నా దుస్థితి
తోటకంతా తెలుసు గానీ
తెలియందల్లా పూలకే నా గతి
_ మీర్ తకీ మీర్
*నా కన్నీటి కబురు
ఆమె చెవిదాకా ఎవరు చేర్చారు?
నా గుండె గుట్టు నలుగురిలో
ఎవరు సుమా రచ్చకీడ్చారు ?
_నాతిక్ గులావఠీ
*మొత్తం ఆ వీధికంతా
నా ఒక్క కొంప లోనే దీపం లేంది
ఆ చీకటే చాలు నీకు
నా చిరునామా చెప్పేస్తుంది.
- బాకీ అహమద్ పురీ
*తెల్లారిపోయినా ఆ కొవ్వొత్తి
ఇంకా ఏడుస్తుంది దేనికని ?
"ఇంకొద్దిగా మిగిలాను
ఇది కూడా కరిగిపోవాలని"
-ఆగ్ జాన్ 'ఏష్ '
*ఆమె నగ్నసౌందర్యం మీద
పరుచుకున్నాయి కురులు
ఒకే సారి ఉదయించాయి
రేయీ మరియూ పవలూ
- హీరాలాల్ పలక్
*'మనసు ఎలా వుంటోందని '
ఆమె నవ్వుతూ అడిగింది
ఒక కన్నీటి చుక్క దొరలి
అలా నిలిచి పోయింది.
-మహిరూల్ కాదరీ
*ఎలాగైతేనేం? ఆమె కళ్ళు
అశ్రు బిందువులు వర్షించాయి
ఆమె చిరు నవ్వుల బరువు కూడా
ఆ నయనాలు మోయలేక పోయాయి
-ఖామోష్
*వెన్నెలని చూసుకునే కదా
చంద్ర బింబం మిడిసి పడుతోంది
ప్రియా! ఒక్క సారి
నీ ముసుగు తీస్తే నిజం తెలుస్తుంది .
-సాహిల్ మానక్ పురీ
*నేను అనుకునే వాణ్ణి
ప్రేమంటే ఫ్రణయ
కలాపం
ఆ తరువాత
తెలిసింది
అది ఒక రుధిర
విలాపం .
-అసర్ లఖ్నవీ
*చాలా అందమైనవి నీ కళ్ళు
తెల్లవార్లూ
మేలుకోకు
సహజ నిద్ర
పడుతుందిలే
నా ఆలోచన రానీయకు
.
_హసన్ కాజ్మీ
*ఈడ్చుకొని వెళ్ళింది
మనసు నీ దగ్గరికి
ఏం చెప్పాలో
చెప్పు ?
అది చేసిన పిచ్చి
పనికి .
_ రషీద్ సిద్ధిఖీ
*హాయిగా ఏడ్చుకునే
స్వేచ్ఛ కావాలి
ఫానీ
ఇది ఆమె వుండే
వీధి
తెలుసుకో !నీ
దు:ఖశాల కాదని .
_ఫానీ
*బహుశా వైద్యంతోనైనా
కుదురుకుంటుందేమో
చావు
కానీ జీవితాన్ని
మాత్రం
బాగు చేసే
మందులేవీ లేవు.
_ఫిరాఖ్
*నా పేరు నేల మీద
రాసి
మళ్ళీ
చెరిపేసింది
ఆమెకది ఒక ఆట
కడకదే నన్ను
మట్టి పాలు చేసింది
-నవాజ్ మహల్ అఖ్తర్
*ఆమె నా శవయాత్ర నాపి
నిలదీసింది ఇలా!
'నిన్ను మా వీధిలోకి
రావద్దన్నాను గానీ
ఈ లోకాన్ని
విడిచిపోతే ఎలా?'
-సఫీ
*నా నుంచి శాశ్వతంగా
విడిపోదామనుకుంటున్నావా
నువ్వు?
గుర్తుగానైనా
ఉండిపోతుంది
వెళ్ళే ముందు
నాకో గాయాన్నివ్వు.
-నూర్ ఇందౌరీ
*ఆమె గుర్తుకురాగానే
అలముకున్నాయి
అశ్రువులు
జ్ఞాపకాలకెంత
దగ్గరో కదా
ఈ కన్నీటి
బిందువులు.
-అంజుమ్
*ఆమె తలపుల తన్మయత్వం
నన్ను విడిచి
పోదు
తరలిపో మరణమా!
నాకిప్పుడు తీరిక
లేదు.
-అజ్ఞాత కవి
*కొందరి సుందరాంగుల చిత్రాలు
మరి కొన్ని
వలపుటుత్తరాలు
నేను మరణించాక
ఇవే నా గదిలో
దొరికే వస్తువులు.
-గాలిబ్
*ప్రియతమా! ఏం చెప్పను?
నా కన్నీటి
బిందువుల తీరు
నిల బడితే నిప్పు
ఒలికి పడితే నీరు
.
-ఫానీ బదాయినీ
*ఎంత పదిలంగా చూసుకున్నా
నా హృదయం నాది
కాలేకపోయింది
ఒక్క నీ ఓర చూపు
తోనే
అది నీ
వశమైపోయింది .
-జిగర్ మురాదాబాదీ
*ఎదురు చూపులకైనా
ఓ హద్దంటూ
ఉంటుంది
కడకు వెన్నెల
కూడా
కరకుటెండలా
మారుతోంది.
-బిస్మాల్ సయూదీ
*ఆమె నా ప్రేమ లేఖ చదివి
అది ఇచ్చిన
వాడితో ఇలా అంది
'ఈ జాబుకు బదులివ్వక పోవడమే
నా జవాబ'ని చెప్పింది.
-అమీర్ మీనాయీ
*తనని చూడగోరే వారికి
తరుణం లభించింది
ఆమె తన మేలి
ముసుగు
అర మోడ్పుగా
తొలగించింది
-అర్ష్ మల్సియాని
*నా కెవరైనా ఎరుక పర్చండి
ఆమెకెందుకు జవాబు
చెప్పాలని?
ఆమె నన్ను
అడుగుతోంది
'తనని ఎందుకు కోరుకున్నాన'ని ?
- షకీల్ బదాయునీ
*వలపు దారిలో అలసి పోయి
ఎక్కడ నేను
చతికిలబడ్డానో
అక్కడ నాకంటే
ముందే వచ్చిన
బాటసారుల్ని
చూశానెందరినో
- బహదూర్ షా జఫర్
నిన్నొకసారి చూస్తే చాల
ఆ కళ్ళు అలా మూసుకుపోతాయి
ఒక్కసారి నీ రూపాన్ని చూశాక
ఇంకా అవి దేన్ని చూస్తాయి
-వహషత్ కలకత్తవీ
జీవితంలో అందరూ ప్రేమిస్తారు
ప్రాణేశ్వరీ !మరణించినా నిన్నేస్మరిస్తుంటాను
నిన్నొక ఊపిరిలా గుండెల్లో పదిలపరిచాను
నిన్ను అదృష్ట రేఖల్లోంచి దొంగిలించాను.
-ఖతీల్ షిఫాయీ
నేనూ మౌనంగా వున్నాను
తానూ నిశ్శబ్దంగా వుంది
ఒక నాజూకు విషయమేదో
మా మధ్యన నలుగుతోంది
-ముల్లా
నా కనీళ్ళని నేను
చప్పరిస్తున్నా కూడా
లోకమంటోంది ఇలా
"వీడు తాగుబోతు గాడా"?
-నరేష్ కుమార్ 'షాద్'
నీ ప్రతి ఓర చూపూ
నిజంగా అది నాకు
ఒక బాణం ఒక ఖడ్గం
ఒకప్పుడది పిడి బాకు
-సాజన్ పెషావరీ
సర్వేశ్వరా!నువ్వు సృష్ఠించిన
సుందరాంగుల్ని చూస్తే ఇలా అనిపిస్తుంది
ఏ ముఖాన్ని చూసినా వెంటనే
హృదయానికి హత్తుకోవాలనుంటుంది
-అక్బర్ ఇలాహాబాదీ
యెండ్లూరి సుధాకర్ గారికి కృతజ్ఞతలతో
No comments:
Post a Comment