2
అంగం లేకుండగా పుట్టి
ఆడదైందని,.
వేటాడబడి వంటరైందని,.
నిరసించబడ్తు,
రసహీనమైందని,.
సౌందర్యమే,.ఆ రూపమని,.
----------------
కవిత్వమే కదా,. ఏదైన
రాసుకుందాం,.
లోపల ఆలోచనల్లో మనమెలా
వున్న,.
అలానే ఇంకొక్కటి,..ఇలా,..
3
చరిత్రను పునర్విమర్శ చేయడం,.
జన్యువులలో ఏర్పడ్డ,.వికృతని,.
పైపై చెత్తలను పట్టి పట్టి
చూసి,.
సాకులు ,.సమాధానాలు
వెతుక్కుంటు,.
ఏ మార్పు లేని
కాలాన్ని,.సాగదీయడం,.
అసలు రాజకీయం,.ఏదో
మనదగ్గరే వుంది,.
4
మానవ వికాసం లో ,.
మిగిలిపోయిన ఆ ఛాయలు,.
తచ్ఛాడుతూనే వున్నాయా,.
నయావికాసం, నవనాగరికతై,.
నీ దేహం ఇప్పుడు
వ్యాపారకూడలైంది,.
,.ఆర్థిక వనరైంది,. హింసాత్మక
దృశ్యమైంది,.
ఆత్మలే లేనివాడి అరాచకాలకు
నిలయమైంది,.
1
ఆడపిల్లంటే మనిషి
కాదిక్కడ,
పుట్టగానే పూడ్చేయబడ్డ,
హృదయాలు,. ఆ ముఖాలు,.
మరి ఇంకా,. ఆ ఒక్కటి
తప్ప,.సమస్తమూ అనుకో,.
ఆడపిల్లంటే మనిషే కాదిక్కడ,.
ఆ ఒకే ఒక అవయవం తప్ప,.
No comments:
Post a Comment