Pages

8 October 2013

అల్పోద్వేగం



1
మార్చుకోవాలిక,. ఈ జీవితాన్ని,.
నాకు నచ్చినట్లు ఎలాగూ వుండలేనప్పుడు,.
నీకు నచ్చినట్లన్నా,. నటించడానికి,..
కొన్ని మార్పులకన్నా,.. అంగీకరించుకోవాలి,.

2
ఇదంతా నిజం అని,.ఒప్పించలేనంత
బలహీనతల భయాలనుంచి,.
బయటపడాలంటే,.
 నీ బలానికి, నేను మరంతగా దాసోహమనాలి,.
3
ఎలక్టాన్లు ఉత్తేజిత స్థాయిని కలగన్నట్లు,.
పాములు పుట్టలకై ఆశపడట్లు,.
సాధారణాలను పక్కన పెట్టి,..
అతితెలివితుత్తర గత్తరల మధ్య,.
చలాగ్గా కదలలేనప్పుడు,.
తలదాచుకోవాలి,.మట్టికడుపుల మధ్య,.

4
బీజాలు బెజ్జాలతో విచ్చిన్నమవుతున్నప్పుడు,.
భయం ప్రవర్థితమై వెలుగుతున్నప్పుడు,.
అహం బ్రహ్మత్వం,.మూర్ఖత్వమై కిరీటమైనప్పుడు,
భిన్నత్వంలో కూడా,.ఒకానొక ఏకత్వం
అసాధారణమైనా,..సంభవిస్తుంటుంది,.

ఇలానే కాకపోయినా,. మరోరూపాలలోనైనా,.

No comments:

Post a Comment