Pages

15 October 2013

బాధ భాష


1
 సమ్జైతలేదు,.ఎంత గిల్లూకున్న,.
గిట్టెందుకై పోనాదో బతుకు,.
గింత కూడా నాకు సమ్జైతలేదు,.

పరాకు మాటోకటి దొర్లిపోనాది,.
మన్నించు,.మాదొర! ,.మన్నించుకో ,.పెబువా!
2
మనసులోపలి బాధ రాతైత లేదు,
గుండెపగిలిన ఘోష గోలైత లేదు,.
ఏమి సేయాలన్న,.వీలైత లేదు,.

నోటి దురదా కొద్ది,. మాటజారింది,
బుర్ర భగభగ మండి గుండమైనాది,,.

పాపాలు,.దోషాలు ఊరకే పోతాయా,.
శాపాలుగా మారి,.కాల్చలేకుంటాయా,.

3
కళ్లు మూసకపోయి,.కొవ్వు పట్టాలేదు,.
వాదాలు,గీదాలు నెత్తికెక్కాలేదు,.
చూడచక్కని మొక్క నీది కాదంటానా,,.
చోటు ఇచ్చిన దాత నువ్వు కాదంటనా,.

ఆనాడు,. చరితలో ఏమి జరిగీనాదో
ఎవరికెవరు అంత మంత్రమేశారో,.
ఎన్ని తంత్రాలేసి,.ఒక్కటైనామో,..
 ఎవరి బుట్టలో ఎవరు,.బొక్క బొర్లడ్డారో,.

ఏ స్వర్గం ఊహించారో,.,ఏ కలలను మోహించారో,.

4
నాదినాదనుకొని,..
ఎరువులే వేసాము,.నీళ్లు పట్టేసాము,.
పాదులే  తొవ్వుతూ,.పాటలే పాడాము,.
కష్టాలు ఫలములై,.మొక్క ఎదిగొచ్చింది,
ఎందరికో చేయిచ్చి,.పైకి తెచ్చింది,
దయతోటి చోటిచ్చి తల్లిచెట్టైంది,.

చెట్టు చుట్టుతా కళ్లాపి చల్లాము,.
ముగ్గులే వేసాము,.పూజలే చేసాము,.
విరగపండిన చెట్టు,కలలు పండిస్తుంటే,.
హాయిగా నీడలో విశ్రమించాము,.

5
కాలాలు గడిచాయి,.స్వార్థాలు పెరిగాయి,.
మొత్తంగా చేజిక్కే సాకు దొరికేసింది,.
ఆరోపణా లొల్లి మళ్లి మొదలైనాది,.

పాది తొవ్వి,  మట్టి దొంగలించామంటివి,.
విశ్రమించి, నీడ దోచుకున్నామంటివి,.
కలలు కని,  చెట్టు ఆక్రమించామంటివి,.

 నా చెట్టే నాకంట నీరు పెట్టించింది,.
నాదన్న ఊరే,. నట్టేట ముంచింది,.

లౌక్యమనుకొని నేను, నవ్వుకోవాలో,.
త్యాగమనుకొని నేను.,.నిబ్బరించాలో,,.

6
ఆశపడి నీడలకు,.
మెతుకులకై వలసొచ్చి,.
చేసినా శ్రమకు, ఇంచ విలువలేక
ఊరుకూరూ పోయి,.దొంగలై పోతిమే,.

భావ ఉద్వేగాలు బుర్రకెక్కించేసి,
తల్లి తరువూనంతా,. దోపిడి చేసి,.
కడుపుకొట్టిన నువ్వు,...దొరవైపోతివి,.

సమ్జైత లేదు,.దొర,. సమ్జైత లేదు,.

నీ గుండెగొప్పలు,..గింతైన, సమ్జైత లేదు,.

8 comments:

 1. a good one.

  ReplyDelete
 2. పెద్ద ఊరును రెండు ఊర్లుగా మారిస్తే
  నీవున్న ఊరు నీది కాకుండ పోతదా?
  నీవున్న ఊరికి కొత్త పేరొస్తే
  నీవున్న ఊరు నీది కాకుండ పోతదా?
  ఊరి సర్పంచొకడు మారిపోయిండంటే
  నీవున్న ఊరు నీది కాకుండ పోతదా?
  నీ చుట్టుపక్కోళ్ళు నీవాళ్ళే అనుకొంటే
  నీవున్న ఊరు నీది కాకుండ పోతదా?
  ఈడనే ఉంటూ, ఈడనే తింటూ,
  ఏ ఊరు పాటనొ నువ్వు పాడుకొంటూ
  ఈ ఊరు నాదింక కాదేమొ అంటూ
  ఎందుకని వగచేవు నా సోదరా?
  ఇన్నాళ్ళు పండ్లతో నీ కడుపు నింపిన
  ఇన్నేళ్ళు నీకెంతొ నీడనే ఇచ్చిన
  ఈ చెట్టుకేనాడు కల్మషం లేదురా!
  ఈ చెట్టు అందరిని ఆదరించునురా!
  ఈ ఊరు నీదిరా నా సోదరా!
  ఈ చెట్టు మనదిరా నా సోదరా!
  ఈ పాటనే పాడు నా సోదరా!
  మేమంత నీతోడు నా సోదరా!

  ReplyDelete
 3. డా.ఆచార్య ఫణీంద్ర గారు,. ఓ మంచి కవిత తో కామెంట్ చేయడం చాలా ఆనందంగా వుంది,.మీరు చెప్పిన విషయాలు చాలా నిజం,. కాని ఫలసాయం పోయిన హైదర బాధ భాష,. కూడ ఇక్కడ కొంత నిజం,.. ధన్యవాదాలండి.

  ReplyDelete
 4. మాకు మీ బాధభాష అర్థం అవుతుంది!ఇన్నేళ్ళూ మేమున్నూ బయటకు నోరువిప్పి చెప్పుకోలేని ఎన్నెన్నో మూగబాధలు అనుభవించిన వాళ్ళమేకదా!బాధపడిన హృదయాలకు బాధభాష మహాబాగా అర్థం అవుతుందిలే అన్నయ్యా!

  ReplyDelete
  Replies
  1. surya prakash apkari గారు,. చదివి, ఓపికగా వ్యాఖ్య రాసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలండి,.

   Delete
 5. వ్యాపార దృష్టిగలవారు ఫలసాయాన్ని గురించి ఆలోచిస్తారు -
  తల్లి ప్రేమను అనుభవిస్తున్నవారు కాదు!

  ReplyDelete
  Replies
  1. డా.ఆచార్య ఫణీంద్ర గారు,. నిజమే,..కాని ప్రజలందరు వ్యాపారులు కారు,.కదా,.మనదనకున్నది,.అనేక అంశాల రీత్యా పరాయిదైపోతుందన్న బాధ కూడా వుండకుడదంటారా,.., ధన్యవాదాలండి,..

   Delete