56
కొట్టుకుపోవడాన్ని
కలగనేవాడికి
పట్టుదొరకడం గురించి
ఆలోచనుండదు.
జ్ఞాపకాల్లో నుంచి
తొలిగిపోయాక
మరణానికి పెద్దగా విలువేం
వుండదు.
57
రోగం వచ్చినప్పుడు కాదు
ఉందని తెలసి
ఉగ్గబెట్టుకోలేని దుఃఖం
అదే పనిగా
తన్నుకొస్తున్నప్పుడు,
వెల్లువగా రాస్తున్నప్పుడు
కాదు,
రాసినదాన్లో కించిత్
కవిత్వం లేదని తెలిసినప్పుడు
ఊరకే బతుకుతున్నప్పుడు కాదు
అది జీవితం కాదని
తెలుసుకున్నప్పుడు
విషాదం
అది మహావిషాదం
18/7/2015
58
విజయాలు ఆనకట్టలు
సహజంగా మిగల్చలేవ్
నదినైనా, నిన్నైనా.
17/7/15
59
చిన్నకవులనుంచి పెద్ద
కవులదాక
ఎక్కడెక్కడ చూడు
కాఫీకేట్లందరు
కవుల క్రింది నలుపు కవులకే
తెలుసు
గురివిందహేళి, ఈ కవుల కేళి.
పాదవ్యర్థాలు :కాఫీకేట్లు = కాపీ కొట్టెే కేటుగాళ్లు
4/6/15
60
ఎక్కడెక్కెడో రగిలి
లోపలంతా కాల్తే కాని
కవితా మంట ఎగసిపడదంటూ,
ఉక్రోఖ్యానం మొదలెట్టానో
లేదో,
బాగా కాలి,
బూడిదయ్యాక చెప్పు
అప్పుడొస్తా,
అంటూ ఉడాయించాడు, వాడు.
ఫుట్ నోట్స్* ఉక్రోఖ్యానం ఉక్రోషంతో
కూడిన వ్యాఖ్యానం
3/7/15
61
తనడుగుతుంది
నీవు రాసే ప్రతి అక్షరంలో
కనిపిస్తున్నది ,
నేనే కదా అని.
నిజానికి అబద్దానికి మధ్య
మౌనంగా నేను .
1/7/15
62
కాళ్లు నాకుతూ
కూర్చుంటాయేంతసేపైన
బొచ్చెలో వేసే బొమికల కోసం.
మొరుగుడంతా
ఎదుటి ముఖాల పైనే.
అంతకంటే ఆశించకు
పెంపుడు కుక్కలవి.
గుర్తు చేసి బాధించకు
కోల్పోయిన జీవితాన్ని.
30/6/15
63
గోడకు కొట్టిన పిడకైనా
కాలానికి ఎండి రాలిపోయాక
ఇంధనమై మండుతుంది.
కవిత్వానికి అతుక్కుపోయాక
కుళ్లిపోతారు అక్కడే
కవులెందుకో.
26/6/15
64
కీర్తీ, కవిత్వంల
ప్రాధాన్యత దేనికిస్తావ్
అని మళ్లీ అడిగాడతను.
ఖ్యాతి/ పేరు కోసం వేసే
కుక్క బిస్కత్తులు
కవితలని
ఎలా చెప్పను.
65
అతనన్నాడు
తల ఎత్తకు
తగ్గి, తగ్గి, తగ్గితేనే
గెలవగలవని.
నవ్వొస్తుంది
చచ్చాక గెలుపెందుకని.
No comments:
Post a Comment